YS Sunitha : తన తండ్రి హత్య కేసు పురోగతి కోసం అసెంబ్లీకి చేరిన వైఎస్ సునీత
ఈకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు...
YS Sunitha : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి(YS Sunitha) మంగళవారం ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. హోంమంత్రి వంగలపూడి అనితతో సునీత భేటీ అయ్యారు. వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసుపై చర్చించారు. అలాగే సీఎంవో అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయానికి వచ్చిన సునీత.. సీఎంవో అధికాకారుతో సమావేశమై.. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై చర్చించారు.
YS Sunitha Visit
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అదే విధంగా సుప్రీం కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు.. ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ముందుగా హోంమంత్రి అనితతో మాట్లాడిన సునీత.. ఆపై సీఎంవో కార్యాలయానికి వెళ్లి అధికారులతో చర్చించారు. తన తండ్రి హత్య కేసులో పురోగతికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు, దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖలపై అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి స్పందన రావాలని కోరుతున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వైఎస్ సునీత విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి హోంమంత్రి అనితతో కూడా వైఎస్ సునీత మాట్లాడినట్లు సమాచారం.
మరోవైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత సుప్రీంను ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై కొద్దిసేపటి క్రితమే సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ మొదలైంది. దీంతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్‌పై దాఖలైన ప్రైవేట్ కంప్లెయింట్‌పైన విచారణ జరుగుతోంది. పిటిషనర్లతో కుమక్కై పదేపదే హింసిస్తున్నారంటూ రాంసింగ్‌పై వెంకటకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అలాగే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతలపై దాఖలైన కేసులపైనా విచారణ జరుగుతోంది. సునీత, రాజశేఖరరెడ్డిల తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. అయితే సీబీఐ తరపున అలాగే అవినాష్ తరపున ఎవరూ హాజరుకాలేదు.
Also Read : AP Govt : ఏపీలో ఇసుక దోపిడీపై 329 పేజీల సాక్షాలను సుప్రీంకోర్టు కి అందజేసిన సర్కార్