YSRCP 2nd List : 27 మంది కొత్త ఇంచార్జిలతో వైసీపీ సెకండ్ లిస్ట్
ప్రజలలో ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్ లిస్ట్
YSRCP 2nd List : వైసీపీ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్ లో పదహారు కొత్త ముఖాలు ఉన్నాయి, తెరపైకి కొంతమంది వారసులు వచ్చారు నలుగురు ఎంపీలకు ఎంఎల్ఏ అభ్యర్థులుగా అవకాశం వచ్చింది. 11 మంది సీట్లు గల్లంతు అయ్యాయి. ఇక వారసుల రూపంలో ఆరుగురు సిట్టింగ్లకు ఊరట లభించింది.
YSRCP 2nd List Released
ఫస్ట్ లిస్టుతో కలిపి ఇప్పటివరకు మొత్తం 38 స్థానాల్లో మార్పులు జరిగాయి, అత్యధికంగా తూర్పు గోదావరి విశాఖ అనంతపురంలో మార్పులు జరిగాయి. ఇంకా రెండు.. మూడు రోజుల్లోనే మూడో జాబితా కూడా ఉంటుందన్నట్టు సమాచారం, ఇక సెకండ్ లిస్ట్ లో ఎంత మందికి చీటింగ్ జరిగింది ఎంత మంది సీట్లు గల్లంతు అయ్యాయి. సెట్టింగ్ ఎంపీల్లో నిరాశ ఎదురైంది ఎవరికి వైసీపీ(YSRCP) అధిష్టానం చేసిన మార్పులు చేర్పులు ఏంటి.
ఫస్ట్ లిస్ట్ లో 11మంది సెకండ్ లిస్ట్ లో 27 మంది రెండు.. మూడు రోజుల్లోనే మూడో జాబితా మూడవ లిస్ట్ లో సీట్లు గల్లంతయ్యేది ఎంతమందికి అడిగిడిగో అంటూ ఉత్కంఠ రేపిన వైసీపీ(YSRCP) సెకండ్ లిస్ట్ వచ్చేసింది, మొదటి జాబితా ప్రకటించిన నాలుగు వరాల తరవాత సెకండ్ లిస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది మొదట 11మందిని, ఇపుడు 27 మందిని, మొత్తం మొత్తంగా 38 మంది ఇంచార్జిలను ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్ లో కేవలం ఏమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటించి సెకండ్ లిస్ట్ లో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది. అనంతపురం, హిందూపురం, అరకు పార్లమెంట్ స్థానాలకు కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది, నలుగురు సెట్టింగ్ ఎంపీలకు ఏమ్మెల్యే టిక్కెట్లు కేటాయించింది వైసీపీ.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీకి, కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురానికి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇంచార్జిలుగా ప్రకటించింది. ఇక మిగతా మార్పులు చుస్తే రాజాం కు తాలే రాజేష్ ను, అనకాపల్లి కి మాలాసాల భరత్ కుమార్ను, పాయకరావు పేటకు కంబాల జోగులును, రామచంద్రాపురానికి పిల్లి సూర్య ప్రకాష్ ను, పి గన్నవరానికి విప్పర్తి వేణు గోపాల్ ను , జగ్గంపేట కు తోట నరసింహంను , ప్రత్తిపాడుకు వరుపుల సుబ్బారావును నియమించింది.
రాజమండ్రి రురల్ కు చెల్లుబోయిన వేగోపాలా కృష్ణను, పోలవరానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బి ఎస్ మగ్గబుల్ అహ్మద్ ను, ఎర్రకొండపాలెం కు తాటిపర్తి చంద్రశేఖర్ ను, ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్ ను, తిరుపతికి భూమన అభినయ రెడ్డి ను, గుంటూరు ఈస్ట్ కు షేక్ నూరి ఫాతిమాను, మచిలీపట్టణం కు పేర్ని కృష్ణ మూర్తి(కిట్టు) ను , చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, పెనుగొండకు కేవీ ఉషశ్రీ చరణ్ ను, పాడేరుకు మత్చ్య రస్య విశ్వేశ్వర్ ను, విజయవాడ సెంట్రల్ కు, వెళ్ళంపల్లి శ్రీనివాసరావు ను, విజయవాడ వెస్ట్ కు షేఖ్ ఆషిఫ్ ను ఇంచార్జిలుగా నియమించింది వైసీపీ.
Also Read : SCR Special Trains : సంక్రాంతి ప్రయానికులకు పండుగ కానుకగా 32 ప్రత్యేక రైళ్లు