YSRCP: ‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ
‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ
YSRCP : పార్లమెంటు ఆమోదం తెలిపిన వక్ఫ్ (సవరణ) బిల్లుకు… రాష్ట్రపతి చేసిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా, తాజాగా వైఎస్సార్ సీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు. అందుకే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో(Supreme Court) సవాల్ చేసింది. ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13,14,25,26లను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చటం వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమే. ఈ నిర్ణయం వక్ఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తోందని వైఎస్సార్‌సీపీ అన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
YSRCP Files Petition..
కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ లో వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఓటు వేసిన విషయం తెలిసిందే. మైనారిటీ సమాజానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. గతంలోనే వక్ఫ్ సవరణ బిల్లుపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్టడంతో లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఓటేశారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం’ అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో వైఎస్సార్‌సీపీ పేర్కొంది.
Also Read : Anna Lezhneva: తిరుమల వెంకన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా