MP Mithun Reddy : పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి హాజరైన వైసీపీ ఎంపీ

హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందిన మిథున్....

Mithun Reddy : చిత్తూరు జిల్లా పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పొందిన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. శుక్రవారం పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మిధున్ రెడ్డి.. బెయిల్ లోని షరతులు ప్రకారం షూరిటీలు సమర్పించారు. గత జూలై 18 న పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్ పై రెండు కేసులు నమోదయ్యాయి.. మిథున్(Mithun Reddy) తో పాటు 29 మంది కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల్లో విచారణ అధికారిగా ఉన్న పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ రావు ఉన్నారు.

ఇప్పటికే పుంగనూరు అల్లర్ల కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందిన మిథున్.. ప్రతి 15 రోజులకు ఒకసారి విచారణ అధికారి ముందు హాజరు కావాలని కండిషన్ ఉంది. మూడు నెలలు వరకు అమలులో ఉన్న ఈ కండిషన్ మేరకు మిథున్ ఈ రోజు పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. రెండు కేసుల్లోనూ ఏ 1 ముద్దాయిగా ఉన్న మిథున్ ఈ రోజు రెండు కేసుల్లో బెయిల్ పొందారు. ఇందులో భాగంగా జామీనుదారులతో కలిసి డీఎస్పీని ఎంపీ మిధున్ రెడ్డి కలిశారు.

MP Mithun Reddy Visit

పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి(Mithun Reddy) వస్తున్నట్లు సమాచారం అందుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పలమనేరుకు చేరుకున్నారు. చిత్తూరు రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మిథున్ కు వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడి నుంచి నేరుగా డి.ఎస్.పి కార్యాలయానికి చేరుకున్న మిథున్.. ముందస్తు బెయిల్ పై కోర్టు ఆర్డర్, కోర్టు ఉత్తర్వు మేరకు షూరిటీ లను సమర్పించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు స్టేషన్ బైయిల్ మంజూరు చేశారు విచారణ అధికారి డీఎస్పీ ప్రభాకర్ రావు.. అనంతరం మీడియాతో మాట్లాడకుండా మిథున్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిథున్ డిఎస్పీ కార్యాలయానికి వస్తారని తెలిసి పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Also Read : India-Canada : కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా పై భగ్గుమన్న భారత్

Leave A Reply

Your Email Id will not be published!