YSRTP Protest : ష‌ర్మిల మోసం కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆఫీసులో ధ‌ర్నా

YSRTP Protest : హైద‌రాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలకు షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ఆఫీసులో కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు తమ పార్టీ బ‌రిలో ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు మీడియా సాక్షిగా. ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి దాని గురించి ఊసెత్త‌క పోవ‌డంతో కార్య‌క‌ర్త‌లు, నేత‌లలో ఆందోళ‌న నెల‌కొంది.

YSRTP Protest Viral

ఈ త‌రుణంలో శుక్ర‌వారం పార్టీ ఆఫీసులో కొంద‌రు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము పార్టీని న‌మ్ముకుని ప‌ని చేశామ‌ని , తీరా ఎన్నిక‌లు వ‌చ్చే స‌మ‌యంలో ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టాక్. దీంతో ష‌ర్మిల త‌మ‌ను మోసం చేసిందంటూ వైఎస్సార్టీపీ(YSRTP) ఆఫీసులోకి ఎంట‌ర్ అయ్యారు. కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. వైఎస్ ష‌ర్మిల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. డౌన్ డౌన్ అంటూ మండిప‌డ్డారు.

దీంతో పార్టీ కార్యాల‌యంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా అనూహ్యంగా వైఎస్ ష‌ర్మిల తెలంగాణాలో ఎంట్రీ ఇచ్చింది. అధికార బీఆర్ఎస్ పార్టీపై, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పాద‌యాత్ర చేప‌ట్టారు. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల రీత్యా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ట్రై చేశారు. కానీ త‌ను అడిగిన సీటు ఇవ్వ‌లేదు. పొత్తు కుద‌ర‌లేదు. ఒంట‌రిగానే పోటీ చేస్తామంటూ ప్ర‌క‌టించారు. తీరా ఇలా జ‌ర‌గ‌డంతో బెడిసి కొట్టింది.

Also Read : MLC Kavitha : కేసీఆర్ ను ఓడించాలంటే కేసీఆరే పుట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!