YUPP TV IPL 2022 : య‌ప్ టీవీకి టాటా ఐపీఎల్ టెలికాస్ట్ రైట్స్

వ‌రుస‌గా ఐదోసారి రిచ్ లీగ్ హ‌క్కులు

YUPP TV IPL 2022 : ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆన్ లైన్ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార‌మ్ ల‌లో ఒక‌టిగా పేరొందింది య‌ప్ టీవీ(YUPP TV IPL 2022). వ‌రుస‌గా ఐదోసారి రైట్స్ చేజిక్కించు కోవ‌డం విశేషం. ప్ర‌పంచ వ్యాప్తంగా 114 దేశాల‌లో టాటా ఐపీఎల్ 2022 ప్ర‌సార హ‌క్కుల‌ను పొందింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్లు పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం ముంబై వేదిక‌గా ఐపీఎల్ 15 సీజ‌న్ ప్ర‌స్తుతం ఈనెల 26 నుంచి ప్రారంభ‌మైంది. ఇక ఐపీఎల్ మ్యాచ్ లు వీక్షించేందుకు కోట్లాది మంది ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

త‌మ టీవీ సెట్ ల‌కు అతుక్కు పోయారు. దీని స్ట్రీమింగ్ హ‌క్కులు య‌ప్ టీవీ పొందింది. ఈనెల 26 నుంచి మే 29 వ‌ర‌కు టెలికాస్ట్ చేస్తారు. య‌ప్ టీవీ(YUPP TV IPL 2022 ) క‌స్ట‌మ‌ర్లు వీటిని ఎంచ‌క్కా ఉప‌యోగించు కోవ‌చ్చు.

ఈ ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. గ‌తంలో ఎనిమిది టీంలు ఉండేవి. ఈసారి 10 జ‌ట్లు ఆడుతున్నాయి.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ , గుజ‌రాత్ టైటాన్స్ , ముంబై ఇండియ‌న్స్ , పంజాబ్ కింగ్స్ , ల‌క్నో జెయింట్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు ఆడుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా యప్ టీవీ ఫౌండ‌ర్, సిఇఓ ఉద‌య్ రెడ్డి మాట్లాడారు. క్రికెట్ ఎల్ల‌ప్పుడూ భారీ క్రౌడ్ పుల్ల‌ర్ గా ఉంటుంద‌న్నాడు. క్రికెట్ ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకే తాము టెలికాస్ట్ రైట్స్ తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచ స్థాయి కంటెంట్ తో గ్లోబ‌ల్ ఇండియ‌న్ డ‌యాస్పోరాకు సేవ‌లందిస్తోంది య‌ప్ టీవీ.

Also Read : చ‌రిత్ర సృష్టించ‌నున్న స్టార్ హిట్ట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!