Yuzvendra Chahal : అరుదైన రికార్డుకు అడుగు దూరంలో
మూడు వికెట్లు తీస్తే అరుదైన ఘనత
Yuzvendra Chahal : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ముగింపు దశకు చేరింది. ఈ రిచ్ లీగ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. యువ క్రికెటర్లు రాణించారు. సీనియర్లు దుమ్ము రేపారు.
ఇక ఆరెంజ్ క్యాప్ రేసులో రాజస్తాన్ రాయల్స్ స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ టాప్ లో ఉన్నాడు. ఇక బౌలింగ్ పరంగా ఇచ్చే పర్పుల్ క్యాప్ రేసులో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టాప్ లో నిలిచాడు.
కాక పోతే ప్రస్తుతం శ్రీలంక క్రికెటర్ హసరంగ చేతిలో ఉంది ఆ క్యాప్. ఆదివారం అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగే కీలక ఫైనల్స్ పోరులో చాహల్(Yuzvendra Chahal) ఒక్క వికెట్ తీస్తే పర్పుల్ క్యాప్ అతడికి దక్కుతుంది.
ఇక మూడు వికెట్లు పడగొడితే గతంలో ఐపీఎల్ లో నమోదైన రికార్డును బ్రేక్ చేయనున్నాడు చాహల్. ఎలాగైనా సరే సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో వికెట్లు తీయలేక పోయాడు.
కానీ ఇప్పటి వరకు టోర్నీలో 26 వికెట్లు తీశాడు. రాజస్తాన్ సాధించిన విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా హసరంగ కూడా 26 వికెట్లు తీశాడు. కానీ మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ లో ఉండడంతో ఆ క్యాప్ శ్రీలంక ఆటగాడి చేతిలోకి వెళ్లింది.
ఇక చాహల్ కు ఒక్క మ్యాచ్ ఆడేందుకు వీలుంది. ప్రస్తుతం ఆసిస్ స్టార్ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్క్ నర్ ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీశాడు 2013లో. డ్వేన్ బ్రావో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఫైనల్ మ్యాచ్ లో యుజ్వేంద్ర చాహల్ ఈ ఘనత సాధించాలని ఆశిద్దాం.
Also Read : ముగింపు వేడుకల్లో రెహమాన్ సందడి