Yuzvendra Chahal-Dhanashree : క్రికెటర్ చాహల్, ధనశ్రీ మధ్య వివాదం భరణం వరకు వచ్చిందా.?
అయితే చాహల్ ఈ వార్తలను ఇంకా ధృవీకరించలేదు...
Yuzvendra Chahal : టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ నుంచి విడిపోనున్నాడని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై చాహల్(Yuzvendra Chahal) కానీ ధనశ్రీ వర్మ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ పుకార్లు షికార్లు చేస్తుండగానే ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకోవడానికి యుజ్వేంద్ర చాహల్ రూ. 60 కోట్లు భరణం చెల్లించనున్నాడన్న మరో వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని, దీని ప్రకారం యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మకు రూ.60 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చాహల్ ఈ వార్తలను ఇంకా ధృవీకరించలేదు.
Yuzvendra Chahal-Dhanashree..
భర్తతో విడాకుల పుకార్ల మధ్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటనను పంచుకుంది. ‘గత కొన్ని రోజులు నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా సాగుతున్నాయి. ఆధారం లేని వార్తలు, ఫేక్ పోస్టులతో నా గౌరవాన్ని చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పేరు, కీర్తి సంపాదించడానికి నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. నా మౌనం నా బలహీనత కాదు. అదే నా బలం. సోషల్ మీడియాలో నెగెటివిటీ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. నేను నిజానికి కట్టుబడాలని ఉండాలనుకుంటున్నాను. విలువలతో ముందుకు సాగాలని అనుకుంటున్నాను. ఎటువంటి ఆధారాలు లేకపోయినా, నిజానికి విలువెక్కువ. “ఓం నమః శివాయ…” అని రాసుకొచ్చింది ధన శ్రీ వర్మ.
అయితేఈ పోస్టులో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోన్న విడాకుల వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు ధన శ్రీ. అలాగే యుజ్వేంద్ర చాహల్ పేరు కూడా ప్రస్తావించలేదు. అందుకే ఈ జంట విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం మరింత ఎక్కువైంది. ఇప్పుడు, యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మకు విడాకుల పరిష్కారంగా రూ.60 కోట్లు ఇస్తున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read : ఇసుక దందాపై సీఎం రేవంత్ సర్కార్ ఘరం