Yuzvendra Chahal Purple Cap : పర్పుల్ క్యాప్ విజేత చాహల్
27 వికెట్లతో ఐపీఎల్ 2022లో టాప్
Yuzvendra Chahal Purple Cap : ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహంచిన యుజ్వేంద్ర చాహల్.
ఏకంగా 27 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో భాగంగా క్వాలిఫయిర్ -2 లో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు చెందిన శ్రీలంకకు చెందిన హసరంగ రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ తీయడంతో 26 వికెట్లు తీశాడు.
దీంతో హసరంగ, చాహల్ ఇద్దరూ చెరి సమానంగా నిలిచారు. దీంతో వికెట్ల శాతం పరంగా చూస్తే హసరంగ చేజిక్కించుకున్నాడు పర్పుల్ క్యాప్. కాగా ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal Purple Cap) కీలకమైన వికెట్ తీశాడు.
గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో మరో వికెట్ అదనంగా వచ్చి చేరడంతో యుజ్వేంద్ర చాహల్ 27 వికెట్లు అయ్యింది. దీంతో హసరంగ చేజిక్కించుకున్న పర్పుల్ క్యాప్(Yuzvendra Chahal Purple Cap) ను దక్కించుకున్నాడు.
దీంతో భారీగా ప్రైజ్ మనీ దక్కింది. ఇదే జట్టుకు చెందిన జోస్ బట్లర్ అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ అవార్డు ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. ఇదిలా ఉండగా చాహల్ అద్భుతంగా రాణించాడు.
మొత్తంగా ఐపీఎల్ లో ఫైనల్ తో కలుపుకుని 17 మ్యాచ్ లలో 7.75 ఎకానమీ రేటుతో వికెట్లు తీశాడు. దీంతో ఇప్పటికే నమోదైన ఇమ్రాన్ తాహిర్ పేరు మీదున్న రికార్డును యుజ్వేంద్ర చాహల్ బ్రేక్ చేశాడు.
Also Read : వెల్ డన్ బాయ్స్ – కుమార సంగక్కర