Yuzvendra Chahal : యుజ్వేంద్ర చాహ‌ల్ సూప‌ర్

రాజ‌స్థాన్ త‌ర‌పున అరుదైన ఘ‌న‌త

Yuzvendra Chahal : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో మోస్ట్ పాపుల‌ర్ బౌల‌ర్ గా పేరొందాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న యుజ్వేంద్ర చాహ‌ల్(Yuzvendra Chahal). గ‌తంలో ముంబై ఇండియ‌న్స్ కు ఆడాడు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీలలో జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలం పాట‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్ మెంట్ అత‌డిని ఏరికోరి తీసుకుంది. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నాడు.

ప్ర‌ధానంగా ఆ జ‌ట్టు త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ప్ర‌తి ఏటా జ‌రిగే ఐపీఎల్ లో ఎక్కువ వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్ కు ఇచ్చే ప‌ర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహ‌ల్(Yuzvendra Chahal) టాప్ లో ఉన్నాడు.

అత‌డి త‌ర్వాత స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ కొనసాగుతున్నాడు. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్ లు ఆడింది. 7 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. 5 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది.

ఈ మొత్తం మ్యాచ్ ల‌లో యుజ్వేంద్ర చాహ‌ల్ ఏకంగా 23 వికెట్లు తీశాడు. ఈ సీజ‌న్ ప‌రంగా చూస్తే రాజ‌స్థాన్ త‌ర‌పున ఇదే అత్యుత్త‌మ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టించాడు.

తాజాగా లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ తో ఈ ఘ‌న‌త సాధించాడు. రాజ‌స్థాన్ త‌ర‌పున రెండో బౌల‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు.

ఇంత‌కు ముందు ఫ‌స్ట్ ప్లేస్ లో జేమ్స్ ఫాల్క‌న‌ర్ పేరు మీదుంది. ఐపీఎల్ లో భాగంగా 2013లో జ‌రిగిన 28 వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించాడు.

 

Also Read : ప‌రువు కోసం ముంబై..చెన్నై పాకులాట‌

Leave A Reply

Your Email Id will not be published!