Yuzvendra Chahal : యుజ్వేంద్ర చాహల్ అరుదైన రికార్డ్
ఐపీఎల్ లో టాప్ ప్లేస్ లోకి
Yuzvendra Chahal : భారత స్టార్ స్పిన్నర్ గా పేరు పొందిన యుజ్వేంద్ర చాహల్ తనదైన రీతిలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో రాణిస్తున్నాడు. గతంలో పలు జట్లకు ఆడినా రాజస్థాన్ రాయల్స్ కు వచ్చాక మరింత మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 16వ సీజన్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో వికెట్లు తీస్తూ తనకు ఎదురే లేదని చాటుతున్నాడు.
పలువురు బౌలర్లు రేసులో ఉన్నా చాహల్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ తానంటూ నిరూపిస్తున్నాడు. తాజాగా అత్యధిక వికెట్ల మార్క్ ను చేరుకున్నాడు యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal). రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన కీలక పోరులో రాజస్థాన్ ఓడి పోయింది. కానీ చాహల్ 4 వికెట్లు తీశాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
ఇప్పటి దాకా తన పేరు మీద ఉన్న బ్రేవో రికార్డును దాటేశాడు చాహల్. 183 వికెట్లు తీశాడు రాజస్థాన్ బౌలర్. తక్కువ మ్యాచ్ లు ఆడి ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన ఘనత సాధించాడు. మొత్తం 142 మ్యాచ్ లలో ఈ వికెట్లు తీశాడు. అంతకు ముందు విండీస్ బౌలర్ బ్రావో 161 మ్యాచ్ లు ఆడి 183 వికెట్లు తీశాడు. ముంబై బౌలర్ పీయూష్ చావ్లా 174 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read : పాకిస్తాన్ చేజారిన ఆసియా కప్