Yuzvendra Chahal : స్పిన్ మంత్రం యుజ్వేంద్ర అద్భుతం
అద్భుతమైన బంతులతో మెస్మరైజ్
Yuzvendra Chahal : భారత్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యుజ్వేంద్ర చాహల్ సత్తా చాటాడు.
రిచ్ లీగ్ లో అత్యధిక వికెట్లు సాధించి టాప్ లో నిలిచాడు. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లు ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు దూరంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు ఆర్ఆర్ తరపున బౌలింగ్ తో మెస్మరైజ్ చేసిన చాహల్ కు అవకాశం ఇచ్చారు.
ఇక ఐదు మ్యాచ్ ల టీ20 సీరీస్ లో భాగంగా ఢిల్లీ, కటక్ లలో జరిగిన మ్యాచ్ లలో భారత జట్టు ఓడి పోయింది. బౌలర్లు రాణించక పోవడంతో సఫారీ విక్టరీ సాధించింది.
ప్రధాన స్పిన్నర్ గా పేరొందిన చాహల్ అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఈ తరుణంలో మాజీ ఆటగాళ్లు విమర్శలకు దిగారు. కానీ ఏపీలోని విశాఖపట్టణం వేదికగా జరిగిన కీలక మూడో టి20 మ్యాచ్ లో తన స్పిన్ మాయాజాలంతో మెస్మరైజ్ చేశాడు.
సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే బంతులతో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. ఆపై కీలక వికెట్లు పడగొట్టాడు. తన బంతికి ఉన్న పవర్ ఏమిటో మరోసారి ఆచరణలో చేసి చూపించాడు యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal).
దీంతో నిన్నటి దాకా విమర్శలు చేసిన మాజీ ఆటగాళ్ల నోళ్లు మూయించాడు తన అద్భుత బౌలింగ్ పర్ ఫార్మెన్స్ తో. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Also Read : తిప్పేసిన యుజ్వేంద్ర చాహల్..పటేల్