Yuzvendra Chahal : ప‌ర్పుల్ క్యాప్ రేసులో చ‌హ‌ల్ టాప్

14 మ్యాచ్ లు 26 వికెట్లు

Yuzvendra Chahal : ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఈసారి ఐపీఎల్ 2022లో అడుగు పెట్టింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. ఆ జ‌ట్టు అటు బ్యాటింగ్ లో

ఇటు బౌలింగ్ లో స‌త్తా చాటుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్లే ఆఫ్స్ కు మూడు జ‌ట్లు చేరుకున్నాయి.

ఇవాల్టితో తాడో పేడో తేలి పోతుంది నాల్గో ప్లేస్ లో ఏ జ‌ట్టు చేరుతుంద‌నేది. టోర్నీలో గుజ‌రాత్ టైటాన్స్ నెంబ‌ర్ వ‌న్ లో ఉండ‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రెండో ప్లేస్ లో నిలిచింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 14 మ్యాచ్ లు ఆడిన రాజస్తాన్ 9 మ్యాచ్ ల‌లో గెలుపొంది 5 మ్యాచ్ ల‌లో ఓడి పోయింది. మొత్తం 18 పాయింట్ల‌తో రాజ‌స్తాన్,

ల‌క్నో చెరీ స‌మానంగా నిలిచాయి.

కాక పోతే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కంటే మెరుగైన ర‌న్ రేట్ ఉండ‌డంతో రెండో స్థానంకు చేరుకుంది. ఇక టోర్నీలో భాగంగా అత్యుత్త‌మ స్కోర్ విభాగంలో ఆరేంజ్ క్యాప్ అవార్డు ఇస్తారు.

ఈసారి ఆరెంజ్ క్యాప్ రేసులో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్టార్ ప్లేయ‌ర్, బిగ్ హిట్ట‌ర్ , ఇంగ్లాండ్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ 627 ప‌రుగుల‌తో టాప్ లో ఉన్నాడు. 

రెండో ప్లేస్ లో కేఎల్ రాహుల్ ఉన్నాడు.

ఇక బౌల‌ర్ల‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ కు ప‌ర్పుల్ క్యాప్ పేరుతో అవార్డు అంద‌జేస్తారు. బౌల‌ర్ల రేసులో రాజ‌స్తాన్ వెట‌ర‌న్

ప్లేయ‌ర్ యజ్వేంద్ర చ‌హ‌ల్(Yuzvendra Chahal) టాప్ లో ఉన్నాడు.

మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన చ‌హ‌ల్ 26 వికెట్లు ప‌డ‌గొట్టాడు. సీఎస్కే కెప్టెన్ ధోనీని ఔట్ చేయ‌డంతో అరుదైన ఫీట్ సాధించాడు. 2019లో ఇమ్రాన్ తాహిర్ పేరు మీద 26 వికెట్ల రికార్డు న‌మోదైంది.

ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండ‌డంతో చ‌హ‌ల్ ఇంకా కొన్ని వికెట్లు తీసే చాన్స్ ఉంది. మొత్తంగా ఐపీఎల్ టోర్నీలో రాజ‌స్తాన్ ఆట‌గాళ్లే ఆరెంజ్, ప‌ర్పుల్ క్యాప్ లు సాధించేలా ఉన్నారు.

Also Read : ఆ ఇద్ద‌రి కంటే జైశ్వాల్ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!