Yuzvendra Chahal Record : యుజ్వేంద్ర చాహ‌ల్ క‌మాల్

టాప్ వికెట్ల లిస్టులో స్పిన్న‌ర్

Yuzvendra Chahal Record : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భార‌త క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్(Yuzvendra Chahal Record) అరుదైన ఘ‌న‌త సాధించాడు. టి20 ఫార్మాట్ లో భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో క‌ళ్లు చెదిరే బంతుల‌తో మెస్మ‌రైజ్ చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు బౌల‌ర్లు ఈ ఘ‌న‌త సాధించారు.

ఇదిలా ఉండ‌గా స్వదేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగిన రెండో వ‌న్డేలో నాలుగు ప‌రుగులు ఇచ్చి కీల‌క వికెట్ తీశాడు యుజ్వేంద్ర చాహ‌ల్. దీంతో టి20 క్రికెట్ లో టాప్ వికెట్ టేక‌ర్ గా నిలిచాడు. ఈ ఒక్క వికెట్ అత‌డిని ప్ర‌త్యేక‌మైన బౌల‌ర్ గా నిలిచాడు.

అతి త‌క్కువ కాలంలో వికెట్లు తీయ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు యుజ్వేంద్ర చాహ‌ల్ టీ20 ఫార్మాట్ లో 75 మ్యాచ్ లు ఆడాడు. 91 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్ లో భార‌త బౌల‌ర్ల‌లో చాహ‌ల్ టాప్ లో(Yuzvendra Chahal Record) నెంబ‌ర్ వ‌న్ గా నిలవ‌గా రెండో స్థానంలో భువనేశ్వ‌ర్ కుమార్ నిలిచాడు. 87 మ్యాచ్ లు ఆడి 90 వికెట్లు తీశాడు. అయితే భువీకి చాహ‌ల్ కు మ‌ధ్య 12 మ్యాచ్ ల దూరం.

మూడో స్థానంలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఉండ‌గా 65 టీ20 మ్యాచ్ లు ఆడాడు…ఇప్ప‌టి దాకా 72 వికెట్లు తీశాడు. ఇక నాలుగో ప్లేస్ లో నిలిచాడు స్పీడ్ స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా. 60 మ్యాచ్ లు ఆడి 70 వికెట్లు తీశాడు. చివ‌ర‌గా ఐదో స్థానంలో టీ20 జ‌ట్టు స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. 86 టీ20 మ్యాచ్ లు 65 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read : ఆడ‌బిడ్డ‌ల విజ‌యం చోప్రా స‌లాం

Leave A Reply

Your Email Id will not be published!