YV Subbareddy : ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా మేము సిద్ధం

ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పామన్నారు...

YV Subbareddy : టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. లడ్డూ విషయంలో పొలిటికల్ కామెంట్ చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగిందన్నారు.

YV Subbareddy Comment

ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పామన్నారు. తన హయాంలో ఏఆర్ కంపనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారన్నారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుందన్నారు. ‘‘ మాపై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మా సమయంలో కల్తీ జరగలేదు. లడ్డూలను ఇంత వరకు టెస్ట్ చేయలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Also Read : MLA Harish Rao : సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మహిళలకు భద్రత లేదు

Leave A Reply

Your Email Id will not be published!