Zakir Naik FIFA : జకీర్ నాయకుకు ఆహ్వానం బీజేపీ ఆగ్రహం
ఫిఫా టోర్నీని బహిష్కరించాలని పిలుపు
Zakir Naik FIFA : ఇస్లం మత ప్రబోధకుడుగా పేరొందిన జకీర్ నాయక్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదిలా ఉండగా ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో మత పరమైన ఉపన్యాసాలు ఇచ్చేందుకు డాక్టర్ జకీర్ నాయకును(Zakir Naik FIFA) ఆహ్వానించింది ఖతార్ ప్రభుత్వం. ప్రస్తుతం ఖతార్ ప్రభుత్వ ఆధ్వరంలో ప్రపంచ ఫుట్ బాల్ రిచ్ టోర్నమెంట్ కొనసాగుతోంది.
ఫిఫా వరల్డ్ కప్ లో ఇస్లాం మతంపై ఉపన్యాసాలు ఇవ్వాల్సిందిగా పరారీలో ఉన్న భారతీయుడు జకీర్ నాయక్ కు రమ్మని పిలువడంపై భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగింది. ఫిఫా ప్రపంచ కప్ ను బహిష్కరించాలని కోరింది. ఇదిలా ఉండగా జకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను చట్ట విరుద్దమైన సంఘంగా కేంద్ర హొం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇందుకు సంబంధించి గోవా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సావియో రోడ్రిగ్స్ మంగళవారం ప్రభుత్వం, భారత ఫుట్ బాల్ అసోసియేషన్ ను, ఆతిథ్య దేశానికి వెళ్లే భారతీయులు క్రీడా ఈవెంట్ ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రపంచం తీవ్రవాదంతో పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో డాక్టర్ జకీర్ నాయక్ కు వేదిక కల్పించడం అంటే ద్వేషాన్ని మరింత వ్యాప్తం చేయడమేనని , ఉగ్రవాద సానుభూతిపరుడికి చోటు కల్పించినట్లేనని స్పష్టం చేశారు.
ఫిఫా వరల్డ్ కప్ అనేది అందరిదీ. అన్ని జాతుల వారు దానిని వీక్షిస్తారు. ఈ సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఎలా పిలుస్తారంటూ ప్రశ్నించారు రోడ్రిగ్స్.
Also Read : విండీస్ కెప్టెన్సీకి నికోలస్ పూరన్ గుడ్ బై