ZEE Sony Scrutiny : జీ గ్రూప్ మోసం సెబీ ఆగ్రహం
సోనీ ఒప్పందం ఆలస్యం అయ్యే ఛాన్స్
ZEE Sony Scrutiny : సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ మీడియా – సోనీ గ్రూప్ ఒప్పందం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ముంబైకి చెందిన జీ గ్రూప్ మీడియా రుణాల రికవరీని నకిలీ చేసిందంటూ సెబీ ఆరోపించింది. ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను తీర్చినట్లు పేర్కొందని బాంబు పేల్చింది. బోర్డు అనుమతి లేకుండా రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించింది.
ఇదిలా ఉండగా ప్రపంచ మీడియా , వినోద రంగంలో టాప్ లో ఉన్న సోని కార్పొరేషన్ జీ మీడియాతో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరిపింది. ఈ తరుణంలో జీ మీడియా గ్రూప్(ZEE) పై సెబీ సంచలన ఆరోపణలు చేయడంతో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదుర్చు కోవడంలో ఆలస్యం జరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఆర్థిక, మీడియా రంగ నిపుణులు.
ఇదిలా ఉండగా కీలక వ్యాఖ్యలు చేసింది. జీ సంస్థ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రతో పాటు తనయుడు , ప్రస్తుతం ఆయా కంపెనీలకు సంబంధించి సిఇవో గా పని చేస్తున్న పునీత్ గోయెంకా తమ పదవులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. తమ స్వప్రయోజనాల కోసం నిధులను స్వాహా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా గోయెంకా దాఖలు చేసిన అప్పీలును సెబీ అప్పిలేట్ ట్రైబ్యునల్ గురువారం విచారించనుంది. ఈ విషయాన్ని సంస్థ తరపు న్యాయవాది వెల్లడించారు.
Also Read : Eric Garcetti Ajit Doval : అజిత్ దోవల్ అంతర్జాతీయ సంపద