Lalchand Rajput : భార‌త్ తో ఆడేందుకు జింబాబ్వే సిద్దం

ప్ర‌క‌టించిన లాల్ చంద్ రాజ్ పుత్

Lalchand Rajput : ఈ ఏడాది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ ) కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌త్యేకించి భార‌త క్రికెట్ జ‌ట్టుకు సంబంధించి కెప్టెన్ల‌ను మార్చుతూ వ‌స్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

విరాట్ కోహ్లీ జ‌ట్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాక ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క కెప్టెన్ స‌రిగా కుదురుకోలేదు. ఏడు మందిని మార్చేసింది. ఒక ర‌కంగా జ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని మాజీ క్రికెట‌ర్లు మండి ప‌డుతున్నారు.

ఈ ఏడాది కీల‌క‌మైన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నుంది. ఆ రిచ్ టోర్నీలో పాల్గొనే జ‌ట్టును ఎంపిక చేసేందుకు భార‌త సెలెక్ట‌ర్లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టును రెండు టీంలుగా మార్చేశారు.

ఒక దానికి సీనియ‌ర్లు మ‌రో దానికి జూనియ‌ర్ల‌ను ఆడిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో టీమిండియాలో ఆడేందుకు ఆట‌గాళ్లు పెద్ద ఎత్తున పోటీ ప‌డుతున్నారు.

దీంతో ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై పోటీ తీవ్ర స్థాయిలో నెల‌కొంది. ఈ త‌రుణంలో ఆగ‌స్టు నెల‌లో జింబాబ్వేలో మూడు వ‌న్డేలు ఆడేందుకు భార‌త జ‌ట్టు వెళ్ల‌నుంది.

కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ , ప్ర‌స్తుత జింబాబ్వే జ‌ట్టుకు టెక్నిక‌ల్ డైరెక్ట‌ర్ గా ఉన్న లాల్ రాజ్ పుత్(Lalchand Rajput). ప్ర‌తి జ‌ట్టు భార‌త జ‌ట్టుతో ఆడాల‌ని అనుకుంటుంద‌ని పేర్కొన్నారు.

ఆ జ‌ట్టు రావ‌డం వ‌ల్ల త‌మ జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌కు మంచి ప్రాక్టీస్ ల‌భిస్తుంద‌న్నాడు. ఆసియా క‌ప్ ఆడేకంటే ముందు ఈ సీరీస్ ఉప‌యోగ ప‌డుతుంద‌ని వెల్ల‌డించాడు రాజ్ పుత్.

Also Read : ఇంగ్లండ్ తో సై అంటున్న టీమిండియా

Leave A Reply

Your Email Id will not be published!