Zomato Announces : జొమాటోలో కొలువుల మేళం

800 జాబ్స్ భ‌ర్తీకి స్వాగ‌తం

Zomato Announces : ఓ వైపు పెద్ద ఎత్తున ఉద్యోగాల‌ను తొల‌గిస్తున్న త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది జొమాటో(Zomato Announces). భారీ తొల‌గింపుల మ‌ధ్య 5 ప్రాంతాల‌లో 800 జాబ్స్ భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డంచింది. టెక్ దిగ్గ‌జ కంపెనీలు ప్ర‌పంచ వ్యాప్తంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు కొలువులకు మంగ‌ళం పాడుతుండ‌గా ప్ర‌ముఖ దేశీయ ఫుడ్ డెలివ‌రీ కంపెనీ జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ దీపింద‌ర్ గోయ‌ల్ శుభ‌వార్త చెప్పారు.

పెద్ద ఎత్తున ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఫుడ్ అగ్రిగేట‌ర్ హైరీ ఇంజ‌నీర్లు, ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్లు, గ్రోత్ మేనేజ‌ర్ల కోసం చూస్తున్న‌ట్లు తెలిపారు సిఇఓ. జ‌న‌ర‌ల్ , ప్రొడ‌క్ట్ ఓన‌ర్ , సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప్ మెంట్ ఇంజ‌నీర్ల‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ను నియ‌మించనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు దీపింద‌ర్ గోయల్.

ఆయా పేర్కొన్న విభాగాల‌లో ప‌ని చేయాల‌ని అనుకునే వారు, అర్హ‌త‌, అనుభ‌వం , ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు, ఔత్సాహికులు ఎవ‌రైనా ఉన్న‌ట్ల‌యితే త‌న‌కు స్వ‌యంగా deepinder@zomato.comకు మెయిల్ చేయాల‌ని కోరారు జొమాటో సిఇఓ. త‌న టీంలోని బృందం ప‌రిశీలించి మీతో ప్ర‌త్య‌క్షంగా మాట్లాడతార‌ని తెలిపారు.

మైక్రోసాఫ్ట్ కు చెందిన సామాజిక మాధ్య‌మ సంస్థ లింక్డ్ ఇన్ లో ఈ విష‌యాన్ని పంచుకున్నారు దీపింద‌ర్ గోయ‌ల్. ఇదిలా ఉండ‌గా కంపెనీ కో ఫౌండ‌ర్ , చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ గుంజ‌న్ పాటిదార్ ఈనెల ప్రారంభంలో రాజీనామా చేశారు. మ‌రో కో ఫౌండ‌ర్ మోహిత్ గుప్తా గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో జొమాటోను వ‌దిలి వేశారు.

Also Read : అమ్మ‌కానికి వాషింగ్ట‌న్ పోస్ట్

Leave A Reply

Your Email Id will not be published!