NIA Raids Arrest : ఎన్ఐఏ సోదాలు 100 మంది అరెస్ట్

దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు

NIA Raids Arrest : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ) దేశ వ్యాప్తంగా గురువారం దాడులు చేప‌ట్టింది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల‌లో దాడులు చేప‌ట్టి కీల‌క‌మైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

ఏపీలోని క‌ర్నూలు, నంద్యాల‌తో పాటు తెలంగాణ‌లోని నిజామాబాద్, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో సోదాలు నిర్వ‌హించింది. తాజాగా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన యాంటీ టెర్ర‌ర్ రైడ్స్ లో 100 మందికి పైగా అరెస్ట్ చేసింది.

తీవ్ర‌వాద సంస్థ‌ల్లో చేరేదుకు ఉగ్ర‌వాదుల‌కు నిధు స‌మకూరుస్తున్నార‌ని, ఇత‌రుల‌ను స‌మూలంగా మార్చారంటూ ఆరోపించిన దాడులు, సోదాలు జ‌రుగుతున్నాయి.

పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ దాడులు, మూకుమ్మ‌డి సోదాల‌ను ఖండించింది. దేశంలోని ప‌లు రాష్ట్రాల‌లో పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ప్రాంగ‌ణాల‌పై దాడులు చేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఉగ్ర‌వాద వ్య‌తిరేక దాడుల్లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఉత్తర ప్ర‌దేశ్ , కేర‌ళ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు స‌హా ప‌ది రాష్ట్రాల‌లో దాడులు చేప‌ట్టింది. పీఎఫ్ఐ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను(NIA Raids Arrest) అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండ‌గా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర పోలీసుల స‌మ‌న్వ‌యంతో దాడులు చేప‌ట్టారు. అత్య‌ధికంగా కేర‌ళ‌లో 22 మందిని, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌కు చెందిన 20 మంది, ఏపీకి చెందిన 5 , అస్సాంలో 9, ఢిల్లీలో 3, మ‌ధ్య ప్ర‌దేశ్ కు చెందిన 4, పుదుచ్చేరిలో 3 , త‌మ‌ళనాడులో 10, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 8, రాజ‌స్థాన్ లో ఇద్ద‌రు చొప్పున ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

ఉగ్ర‌వాదానికి నిధులు స‌మ‌కూర్చ‌డం, శిక్ష‌ణా శిబిరాల‌ను నిర్వ‌హించ‌డం పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చేస్తోందంటూ ఎన్ఐఏ ప్ర‌క‌టించింది.

Also Read : లిక్క‌ర్ స్కాం @ సిగ్న‌ల్ యాప్ లింక్

Leave A Reply

Your Email Id will not be published!