Akhilesh Yadav : యూపీలో ఎన్నికల రణ రంగం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రచారం మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 403 స్థానాలకు గాను మూడు విడతల పోలింగ్ ముగిసింది.
ఈనెల 23న బుధవారం నాలుగో విడత పోలింగ్ ప్రారంభం అవుతుంది. ప్రధానంగా అధికారంలో ఉన్న యోగి ఆదిత్యా నాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav )ల మధ్య పోటీ నెలకొంది.
బరిలో కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం, ఇతర పార్టీలు ఉన్నా ఇరు పార్టీల మధ్యే యుద్దం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో యూపీ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన బహిరంగ సభలో అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav )ప్రసంగించారు.
తమ పార్టీ విజయం సాధించి పవర్ లోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ భర్తీ చేసే కొలువుల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు అఖిలేష్ యాదవ్.
అంతే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంద చేస్తామన్నారు. 69, 000 టీచర్ల నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు.
ప్రత్యేకించి మహిళకు గుడ్ న్యూస్ చెప్పారు. మహిళలకు వారి స్వంత జిల్లాలోనే పని చేసే ఛాన్స్ ఇస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం రాచరిక పాలన సాగిస్తోందంటూ మండిపడ్డారు.
Also Read : బుమ్రాపై సన్నీ ప్రశంసల జల్లుభజరంగ్ దళ్ కార్యకర్త కేసులో పురోగతి