11A Seat: విమానంలో ‘11 ఎ’ సీటు స్పెషాలిటీ

విమానంలో ‘11 ఎ’ సీటు స్పెషాలిటీ

11A Seat : అహ్మదాబాద్‌ లో ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ 171 విమానం టేకాఫ్‌ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్‌ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు. కాని విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది సిబ్బందితో సహా 242 మందిలో… కేవలం విశ్వాస్‌ కుమార్‌ అనే భారతి సంతతికి చెందిన బ్రిటిష్‌ పౌరుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

11A Seat Special

దేశ చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిపోయన ఈ ప్రమాదంలో సుమారు 274 మంది కనీసం మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదయినప్పటికీ… విశ్వాస్ కుమార్ మాత్రం… ఆ ప్రమాద ఘటన నుండి లేచి నడుచుకుంటూ రావడంతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే ఈ ఘోర ప్రమాదం నుండి విశ్వాస్ కుమార్ బయటపడటానికి కారణం… ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ లోని ఆయన కూర్చున్న నంబర్‌ 11ఏ సీటు (11A Seat) అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గర్లో ఉండటం. అత్యవసర ద్వారం దగ్గర ఉండటంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడటానికి దోహదపడి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ఈ నంబరు సీటు గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 27 ఏళ్ల క్రితం ఇదేవిధంగా జరిగిన ఓ విమాన ప్రమాదంలోనూ 11A సీటులో కూర్చున్న వ్యక్తి సురక్షితంగా బయటపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

అహ్మదాబాద్‌ (Ahmedabad) విమాన ప్రమాదంలో 11A సీటులో (11A seat) కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వచ్చిన వార్తలు చూసి తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని థాయ్‌ నటుడు, గాయకుడు రువాంగ్‌సక్‌ లాయ్‌చూజాక్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఎందుకంటే దాదాపు 27 ఏళ్ల క్రితం డిసెంబర్ 11, 1998న థాయ్ ఎయిర్‌వేస్ విమానం (TG261) దక్షిణ థాయిలాండ్‌ లో దిగడానికి ప్రయత్నిస్తుండగా కూలిపోవడంతో అందులోని 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అందులో 45మంది మాత్రమే గాయాలతో బయటపడగా… ఆ సమయంలో 11A సీటులో కూర్చున్న తాను మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు అలాగే జరిగేసరికి తాను షాక్‌ అయ్యానని తెలిపారు.

నా విషయంలోనూ ఇదే మిరాకిల్‌ – సింగర్‌ రౌంగ్‌సక్‌ 

ఈ సందర్భంగా థాయ్ నటుడు, సింగర్‌ రౌంగ్‌సక్‌ లోయ్‌చుసక్‌ మాట్లాడుతూ… ‘ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో (11A Seat) కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను. ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని.

నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి’ అని చెప్పుకొచ్చాడు. భయంతో పదేశ్ల పాటు తాను విమానంలో ప్రయాణించలేదని గుర్తు చేసుకున్నారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. దీనితో విమానంలోని సీట్‌ నంబర్‌ 11ఏ సీటుపై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ సీటులో కూర్చుంటే ప్రమాద సమయాల్లో సురక్షితంగా బయటపడవచ్చని సూచిస్తున్న పలువురు నిపుణుల పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1998లో విషాదం

1998లో రౌంగ్‌సక్‌ లోయ్‌చుసక్‌ ప్రయాణించిన థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఫ్లైట్‌ TG261 విమానం బ్యాంకాక్‌ నుంచి సూరత్‌ బయల్దేరింది. ల్యాండ్‌ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు. అయితే సీట్‌ నంబర్‌ 11ఏ కూర్చొన్న ఈయన మాత్రం చిన్న గాయం కూడా లేకుండా సురక్షితంగా బయపడ్డారు.

Also Read : PM Narendra Modi: జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!