IAS Transfers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇటీవల 11 మంది సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 12మందిని వివిధ జిల్లాల కలెక్టర్లుగా నియమించింది. ఈసారి 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సోమవారం అంటే.. ఆగస్టు 8వ తేదీన రాష్ట్రంలోని 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ (IAS Transfers) చేసింది. మూడ్రోజుల వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం గమనార్హం. అయితే ఈసారి ఈ బదిలీ ప్రక్రియలో పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది ఏపీ సర్కార్.
IAS Transfers – 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు వీరే
1. పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి
2. విజయనగరం – రామసుందర్ రెడ్డి.
3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
4. గుంటూరు – తమీమ్ అన్సారియా
5. పల్నాడు – కృతిక శుక్లా
6. బాపట్ల – వినోద్ కుమార్
7. ప్రకాశం – రాజా బాబు
8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
10. కర్నూలు – డాక్టర్ ఎ సిరి
11. అనంతపురం – ఓ.ఆనంద్.
12. సత్య సాయి – శ్యాంప్రసాద్
IAS Transfers – కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్ల తో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్సు
కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్ల తో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ… సీఎం అంటే కామన్ మాన్ అని నేను చెబుతున్న మీరు కూడా అలాగే పని చేయాలి. ప్రతి పనికి దానికీ డబ్బులు లేవని చెప్పద్దు. కేంద్రం నుంచి వచ్చే పధకాలు ఉపయోగించు కోవాలి. అన్నిటికి రూల్స్ అనకండి. మానవీయ కోణం లో పని చేయండి. కలెక్టర్ గా పని చేయడం అంటే మీకు మంచి అవకాశం, గుర్తింపు వస్తుంది. జిల్లా కలెక్టర్ల ఎంపికలో నాకున్న బెస్ట్ ఆప్షన్లు లలో మిమ్మల్ని ఎంపిక చేశాను. నాలుగో సారి సీఎం గా ఉన్నా నా టీమ్ మీరే… పని చేసే వారిని ప్రోత్సహిస్తా… లేకపోతే మిమ్మలిని కొనసాగించను. ఇతర జిల్లాల కలెక్టర్ల తో పోటీ పడండి. మీ నిర్ణయాలు క్రియేటివ్ గా… ఇన్నోవేటివ్ గా ఉండాలి. సోషల్ మీడియా..మీడియా లో దుష్ప్రచారం పై ఫస్ట్ అవర్లోనే రియాక్ట్ కావాలి. కలెక్టర్ అంటే అహంకార ,ఇగో లు వద్దు అని సూచించారు.
ఏపీలో 11 మంది ఐఎఫ్ఎస్ల బదిలీ
ఏపీలో 11 మంది ఐఎఫ్ఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ – రాజేంద్రప్రసాద్
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ – ఎస్.ఎస్.శ్రీధర్
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి – ఎస్ శ్రీ శర్వాణన్
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ – ఎస్.శ్రీకాంతనాథరెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్ – బి.విజయ్‌కుమార్
కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్ – బి.వి.ఎ.కృష్ణమూర్తి
రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారిణి – ఎం.బబిత
డిప్యూటీ కన్జర్వేటర్‌గా ఆఫ్ ఫారెస్ట్ – జి.జి.నరేంద్రన్
తిరుపతి డీఎఫ్‌వో – వి.సాయిబాబా
ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ – జి.విఘ్నేశ్ అప్పావు
నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ – పి.వివేక్.
Also Read : SIT Raids: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ సన్నిహితుడి ఇంట్లో సిట్ సోదాలు
