Google Layoffs : గూగుల్ లో 12,000 మంది తొలగింపు
మాతృ సంస్థ ఆల్ఫా బెట్ లో షాక్
Google Layoffs : కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగాల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ , అమెజాన్ , తదితర సంస్థలన్నీ ఇప్పటికే వేలాది మందిని సాగనంపాయి. తాజాగా ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శుక్రవారం సిఇఓ సుందర్ పిచాయ్ తమ మాతృ సంస్థ గూగుల్ ఆల్ఫా బెట్ లో 12,000 మంది ఎంప్లాయిస్ ను తొలగిస్తున్నట్లు(Google Layoffs) పేర్కొన్నారు.
ఉద్యోగాల కోతలు రిక్రూటింగ్ , కొన్ని కార్పొరేట్ విధులు, కొన్ని ఇంజనీరింగ్ , ఉత్పత్తుల బృందాలతో సహా కంపెనీ అంతటా టీమ్ లను ప్రభావితం చేయనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపారు సిఇఓ. ఈ తొలగింపులు గ్లోబల్ , యుఎస్ సిబ్బందపై ప్రభావం చూపుతాయని గూగుల్(Google Layoffs) స్పష్టం చేసింది.
ఆల్ఫా బెట్ ఇంక్ లో ఉద్యోగులను తొలగిస్తున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు సుందర్ పిచాయ్ రాయిటర్స్ తో మాట్లాడుతూ. ఇదిలా ఉండగా ఈ కోతలు సాంకేతిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. మరో వైపు ప్రత్యర్థి కంపెనీ మైక్రో సాఫ్ట్ కంపెనీ ఇప్పటికే 10,000 మందిని తొలగించింది. అమెజాన్ సంస్థ 18,000 వేల మందిని , ట్విట్టర్ లో 9,000 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.
ఇదిలా ఉండగా సాంకేతికంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్ వచ్చాక ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక ట్విట్టర్ సంస్థను టేకోవర్ చేసుకున్న టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ముందుగా ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. దీనికి ఆయన పెట్టిన పేరు కాస్ట్ కటింగ్ అని.
Also Read : ఉద్యోగులను ఉబెర్ తొలగించనుందా