IPS Officers: మూకుమ్మడి సెలవులో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు !

మూకుమ్మడి సెలవులో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు !

IPS Officers: ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు ఆశక్తికరంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో వైసీపీతో అంటకాగిన ఐపీఎస్ లపై కూటమి ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొలువుతీరిన తరువాత పలువురు ఐపీఎస్(IPS Officers) లను కనీసం కలవడానికి కూడా సీఎం చంద్రబాబు అంగీకరించలేదు. మరోవైపు గత ప్రభుత్వంతో అంటకాగిన సుమారు 16 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పలువురు ఐపీఎస్ లు డీజీపీ కార్యాలయంలో డైలీ రిపోర్ట్ చేయకపోవడం… ఇంకా వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారనే అనుమానంతో వారిని రోజూ డీజీపీ కార్యాలయానికి వచ్చి రిజిస్టర్ లో సంతకం పెట్టి పని గంటలు ముగిసే వరకు అక్కడే ఉండాలంటూ ఇటీవల డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే

ఈ నేపథ్యంలో ఆ 16 మంది ఐపీఎస్ అధికారులు కూడా మూకుమ్మడి సెలవు పెట్టినట్లు సమాచారం. పోస్టింగ్‌ల కోసం నిరీక్షిస్తున్న ఐపీఎస్‌ అధికారులు ఇంకా వైసీపీకే మొగ్గు చూపుతున్నారని నిఘా వర్గాల సమాచారం. కేసులు బలహీన పరిచేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని తేలింది. దీనితో నిరీక్షణలో ఉన్న 16 మందిని డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు వీరు మూకుమ్మడి సెలవు పెట్టడంతో… ప్రభుత్వం, పోలీస్ బాస్ వీరిపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

IPS Officers – వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న అధికారులు వీరే..

1. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, డీజీ,
2. పీవీ సునీల్‌కుమార్, డీజీ,
3. ఎన్‌.సంజయ్, అదనపు డీజీ,
4. కాంతి రాణా తాతా, ఐజీ,
5. జి.పాలరాజు, ఐజీ,
6. కొల్లి రఘురామ్‌రెడ్డి, ఐజీ,
7. ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, డీఐజీ,
8. సీహెచ్‌.విజయరావు, డీఐజీ,
9. విశాల్‌ గున్నీ, డీఐజీ,
10. కేకేఎన్‌ అన్బురాజన్, ఎస్పీ,
11. వై.రవిశంకర్‌రెడ్డి, ఎస్పీ,
12. వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ,
13. కె.రఘువీరారెడ్డి, ఎస్పీ,
14. పి.పరమేశ్వర్‌రెడ్డి, ఎస్పీ,
15. పి.జాషువ, ఎస్పీ,
16. కృష్ణకాంత్‌ పటేల్, ఎస్పీ.

Also Read : Bosta Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక !

Leave A Reply

Your Email Id will not be published!