TSSPDCL Jobs 2023 : తెలంగాణ ఎస్పీడీసీఎల్ లో 1,601 జాబ్స్

జూనియ‌ర్ లైన్ మెన్, ఏఈ పోస్ట్ లు

TSSPDCL Jobs 2023 : తెలంగాణ‌లో కొలువుల మేళం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం 82 వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించి. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్లు జారీ చేసింది. గ్రూప్ -1 కు సంబంధించి ప్రిలిమిన‌రీ ప‌రీక్ష పూర్తి చేసింది. మెయిన్స్ నిర్వ‌హించాల్సి ఉంది. మ‌రోవైపు గ్రూప్ – 4, గ్రూప్ -2 పోస్టుల‌కు కూడా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. ఈ త‌రుణంలో రాష్ట్రంలోని వివిధ శాఖ‌ల‌కు సంబంధించి ఆయా బోర్డులే నియ‌మిస్తున్నాయి.

ఇప్ప‌టికే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌కు ప‌రీక్ష నిర్వ‌హించింది. తాజాగా ద‌క్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో 1,553 జూనియ‌ర్ లైన్ మెన్ , 48 అసిస్టింటె్ ఇంజ‌నీర్ పోస్టులు(TSSPDCL Jobs 2023) ఉన్నాయి. మొత్తం రెండు జాబ్స్ క‌లిపి 1601 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని వ‌ల్ల 10 సంవ‌త్స‌రాలు అద‌న‌పు సౌక‌ర్యం క‌లుగుతుంది. జూనియ‌ర్ లైన్ మెన్ పోస్టుకు సంబంధించి 10వ త‌ర‌గ‌తితో పాటు ఐటీఐ లో ఎల‌క్ట్రిక‌ల్ ట్రేడ్ లేదా వైర్ మ్యాన్ క‌లిగి ఉండాలి . లేదా ఇంట‌ర్ లో ఒకేష‌న‌ల్ కోర్సు చేసి ఉండాలి.

అసిస్టెంట్ ఇంజ‌నీర్ పోస్టుల‌కు గాను ఇంజ‌నీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి. ఇందులో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ , ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఇక జూనియ‌ర్ లైన్ మెన్ పోస్టుల‌కు 18 నుంచి 35 ఏళ్లు, ఏఈ పోస్టుల‌కు 18 నుంచి 44 ఏళ్ల వ‌య‌స్సు ఉంటుంది.

ఇక వేత‌నం ప‌రంగా చూస్తే జూనియ‌ర్ లైన్ మెన్ కు రూ. 24,340 నుంచి రూ. 39, 405 , ఏఈకి రూ. 64,205 నుంచి రూ. 99, 345 చెల్లిస్తారు. రాత ప‌రీక్ష ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

Also Read : హైకోర్టులో సివిల్ జ‌డ్జి పోస్టులు

Leave A Reply

Your Email Id will not be published!