2024 Elections: ఓటరు చైతన్యంపై పాట పాడిన ఎన్నికల అధికారి !
ఓటరు చైతన్యంపై పాట పాడిన ఎన్నికల అధికారి !
2024 Elections: మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో కేంద్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న భారత్(Bharat) లో 18 ఏళ్లు నిండి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా వివిధ రూపాల్లో ప్రజలను చైతన్యం చేస్తున్నారు. దీనిలో భాగంగా తమిళనాడులో జరగనున్న తొలివిడత లోక్సభ ఎన్నికల్లో ఓటరు చైతన్యానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సత్యప్రద సాహు గళమెత్తారు. తొలిసారి ఓటు వేస్తున్న యువతలో చైతన్యం కలిగి, తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకునేలా తానే స్వయంగా స్టూడియోకు వెళ్లి పాట పాడి ఆ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు ఓటర్లను చైతన్య వంతులను చేసే విధంగా ఈ పాటను ఆలపించారు.
2024 Elections Song Viral
తమిళనాడు రాష్ట్రంలో తొలిసారి ఓటు వేస్తున్న 18-19 ఏళ్ల వయసువారు 5.26 లక్షలమంది ఉండగా… తాజాగా ఓటు నమోదు చేసుకున్న 20-29 ఏళ్ల మధ్యవారు 3.1 లక్షలమంది ఉన్నారు. వీరందరికీ ఓటుహక్కు ప్రాధాన్యం తెలియజేసేలా తన పాటలో కీలక విషయాలను సీఈవో వివరించారు. తమిళంలో పాడిన ఈ పాట బాగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సత్యప్రద సాహు మాట్లాడుతూ… 2019 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో 73 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఈసారి వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రజల్ని చైతన్యపరుస్తున్నామన్నారు.
Also Read : Jupally Krishna Rao : ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి