Surat: సూరత్‌లో రూ. 25 కోట్ల విలువైన డైమండ్స్ చోరీ

సూరత్‌లో రూ. 25 కోట్ల విలువైన డైమండ్స్ చోరీ

Surat : గుజరాత్‌ లో భారీ వజ్రాల చోరీ చోటుచేసుకుంది. దాదాపు రూ.25 కోట్లు విలువ చేసే వజ్రాలను దొంగలు దోచుకున్నారు. సూరత్‌ (Surat) లోని డీకే అండ్‌ సన్స్‌ డైమండ్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. కంపెనీలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వజ్రాలను చోరీ చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.

25 Crores Worth Diamonds in Surat

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం … సూరత్‌ (Surat) నగరంలోని కపోద్రా ప్రాంతంలో డీకే అండ్ సన్స్ డైమండ్ కంపెనీ ఆఫీస్ కమ్ పాలిషింగ్ యూనిట్‌లో ఆగస్టు 15 నుంచి 17 మధ్య ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం కావడం గమనార్హం. కంపెనీకి వరుసగా మూడురోజులు సెలవులు ప్రకటించడంతో ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది లేని సమయంలో ఈ వజ్రాల చోరీ జరిగినట్లు కంపెనీ పేర్కొంది. దీన్ని అవకాశంగా తీసుకున్న దుండగులు మొదటగా కంపెనీ కింది ఫ్లోర్‌లోని ప్రధాన డోర్‌ను బద్దలు కొట్టి ఆ తర్వాత మెటల్‌ సేఫ్‌ ఉంచిన మూడో ఫ్లోర్‌కి వెళ్లారు. అనంతరం గ్యాస్‌ కట్టర్‌తో సేఫ్‌ ను కత్తిరించారు. కంపెనీ యూనిట్‌ యజమాని సెలవుల అనంతరం సోమవారం కార్యాలయానికి వెళ్లగా ఈ విషయం తెలిసిందని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో దాదాపు రూ.25 కోట్లు విలువ చేసే వజ్రాలను దోచుకున్నట్లు అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు.

Surat – సైబర్‌ నేరగాళ్ల నుంచి రూ.5,489 కోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు

సైబర్‌ నేరగాళ్ల నుంచి ఇప్పటి వరకు రూ. 5,489 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 12 లక్షలకుపైగా మొబైల్స్‌ను బ్లాక్‌ చేశామని, 13 లక్షలకుపైగా బ్యాంకు అకౌంట్లను నిలిపివేసినట్లు తెలిపారు. సైబర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ డివిజన్‌(సీఐఎస్‌) కార్యకలాపాలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు.

ఆ సొమ్ము త్వరగా బాధితులకు అందేలా నిబంధనలను సులభతరం చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారులు లక్ష్యంగా సాగే ఆన్‌లైన్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. సైబర్‌ మోసాలపై స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

Also Read : Shubhanshu Shukla: ప్రధాని మోదీతో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భేటీ

Leave A Reply

Your Email Id will not be published!