Operation Kagar: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ ! 26 మంది మావోయిస్టులు మృతి !
కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ ! 26 మంది మావోయిస్టులు మృతి !
Operation Kagar : ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్లతో… మావోయిస్టులు పెద్ద ఎత్తున తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో తల దాచుకున్న విషయం తెలిసిందే. దీనితో కర్రెగుట్టల్లో దాగున్న మావోయిస్టులను… పట్టుకోవడానికి గత వారం పదిరోజులుగా భద్రతాబలగాలు ఆపరేషన్ కగార్(Operation Kagar) ను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల్లో కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇదే విషయాన్ని అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఘటనా స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ ఆపరేషన్‌ను డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీన్ని ఏడీజీ వివేకానంద సిన్హా పర్యవేక్షిస్తున్నారు. సీఆర్పీఎఫ్ ఐజీ రాకేశ్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందరరాజ్ ఎప్పటికప్పుడు ఆపరేషన్‌పై ఆరా తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Operation Kagar – అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు నలుగురు మావోయిస్టులు మృతి
మరోవైపు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని వై.రామవరం, జీకేవీధి మండలాల సరిహద్దుల్లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలోనే రెండు ఏకే-47లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనాస్థలంలో ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
Also Read : Mock Drills: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‌లో మాక్ డ్రిల్స్