Ahmedabad Court : అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భారత దేశ చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఏకంగా 38 మందికి మరణ శిక్ష విధించింది.
అంతే కాకుండా కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న మరో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి ఏఆర్ పాటిల్ తీర్పు చెప్పారు. ఒక కేసులో ఇంత మందికి ఉరి శిక్ష విధించడం దేశాన్ని ఆశ్చర్య పోయేలా చేసింది.
అహ్మదాబాద్ (Ahmedabad Courtలో రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఉగ్రమూకలు 2008లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, మున్సిపల్ ఆస్పత్రి, కార్లు, పార్కింగ్ ప్రదేశాలను ఎంచుకున్నారు.
ఈ మొత్తం పేలుళ్లలో 58 మంది మృతి చెందారు. ఇందులో 200 మందికి పైగా గాయాలయ్యాయి. కొన్ని బాంబులను ముందే గుర్తించిన భద్రతా దళాలు వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో కొంత ప్రాణ నష్టం తప్పింది.
దోషులకు ఒక్కరొక్కరికి 2. 85 లక్షల చొప్పున జరిమానా విధించింది. పేలుళ్ల ఘటన కేసు త్వరితగతిన విచారణ కోసం నియమించిన ప్రత్యేక న్యాయ స్థానం చట్ట విరుద్ద కార్యకలాపాల చట్టం -యూఏపీఏ , భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 302 ప్రకారం మరణ శిక్ష విధించింది.
పేలుళ్లలో మరణించిన వారికి రూ. లక్ష చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ తీర్పు చెప్పారు. తీవ్రంగా గాయాలైన వారికి రూ. 50 వేలు, మైనర్ బాధితులకు రూ. 25 వేలు ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం ఈ తీర్పు దేశమంతటా కలకలం రేపింది. నేరస్తులను జంకేలా చేసింది.
Also Read : అరవింద్ కేజ్రీవాల్ పై చన్నీ కన్నెర్ర