PM Dhan Dhanya Yojana: పీఎం ధనధాన్యయోజనలో ఏపీ నుంచి 4 జిల్లాలకు చోటు
పీఎం ధనధాన్యయోజనలో ఏపీ నుంచి 4 జిల్లాలకు చోటు
PM Dhan Dhanya Yojana : కేంద్ర ప్రభుత్వం జులై 16న ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన (PM Dhan Dhanya Yojana) కింద ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరిసీతారామరాజు(ఏఎస్‌ఆర్), శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేశారు. వీటికి నోడల్ అధికారులుగా నలుగురు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఏఎస్‌ఆర్ జిల్లాకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంయుక్తకార్యదర్శి అమిత్‌సింగ్లా (ఏజీఎంయూటీ కేడర్), శ్రీసత్యసాయి జిల్లాకు సహకారశాఖ సంయుక్తకార్యదర్శి సిద్దార్థ్‌జైన్, అనంతపురం జిల్లాకు పెటోల్రియం సహజవాయువులశాఖ సంయుక్త కార్యదర్శి సుజాతశర్మ (ఇద్దరూ ఏపీకేడర్), అన్నమయ్య జిల్లాకు కార్పొరేట్ వ్యవహారాలశాఖ సంయుక్త కార్యదర్శి బాలమురుగన్ (బిహార్ కేడర్) నియమితులయ్యారు.
PM Dhan Dhanya Yojana Updates
వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపికచేసి అక్కడ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద పంట మార్పిడిని ప్రోత్సహిస్తారు. సాగునీటి సౌకర్యం, పంటల సామర్థ్యం మెరుగుపరుస్తారు. రైతులకు తగినంత రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంతో అమలుచేస్తున్న ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలోని 11 మంత్రిత్వశాఖల పరిధిలో ఉన్న 36 పథకాలను సమ్మిళితంచేసి దీని కింద అమలుచేస్తారు. తద్వారా 1.7 కోట్లమంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ పథకం కింద ఎంపికచేసిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, నీతిఆయోగ్ సాయంతో కలెక్టర్లు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తారు. దీని అమలుతీరు పర్యవేక్షణకోసం డిజిటల్ డ్యాష్‌బోర్డు, రైతులకోసం యాప్, జిల్లా ర్యాంకింగ్ వ్యవస్థను అమల్లోకి తెస్తారు.
Also Read : CM Chandrababu: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
