Chile President : చిలీలో వారానికి 40 గంటల పని – ప్రెసిడెంట్
సంచలన ప్రకటన చేసిన గాబ్రియేల్ బోరిక్
Chile President : యావత్ ప్రపంచం విస్తు పోయేలా వామపక్ష, మార్క్సిస్ట్ భావజాలం కలిగిన దేశాధినేతగా పేరొందారు చిలీ ప్రెసిడెంట్(Chile President) గాబ్రియేల్ బోరిక్. ఎన్నికల హామీలో భాగంగా ఒక్కొక్క దానిని అమలు పరుస్తూ వస్తున్నారు.
తాను గనుక ప్రెసిడెంట్ గా ఎన్నికైతే వెంటనే దేశంలో వారానికి కేవలం 40 గంటలు పని ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు దానిని అమలు పరిచేందుకు రెడీ అయ్యారు.
ఇందు కోసం ముసాయిదాను సిద్దం చేయాలని ఆదేశించారు. ఆనాడు కార్మికులకు పని గంటలు ఉండాలని మేడే పుట్టింది. ఒక ఉద్యమం నడించింది.
తాజాగా పని గంటల విధానంలో ఒక్కో సంస్థ ఒక్కోలా వ్యవహరిస్తూ వస్తోంది. దీనిని గమనించిన ప్రెసిడెంట్(Chile President) గాబ్రియేల్ బోరిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిలీ రాజ్యాంగ విధానంలో ప్రెసిడెంట్ గనుక ఏదేని అంశం పై అత్యవసరం అని ప్రకటిస్తే దానిని బేషరతుగా బిల్లు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందుకు చట్ట సభ సభ్యులు ఓకే చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోరిక్ చేసిన ఈ 40 గంటల పని ప్రకటనపై దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
దేశంలో ఇప్పుడున్న పని గంటలను వారానికి 40 గంటలికి కుదింపు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బిల్లును ఆమోదించే ప్రయత్నాలను పునరుద్దరించినట్లు చిలీ చీఫ్ స్పష్టం చేశారు.
ఐదేళ్ల లోపు పని వారాన్ని 45 నుండి 40 గంటలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న బిల్లు 2017లో అప్పటి చట్టసభ సభ్యులు , ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి కమీలా వల్లేజో ప్రవేశ పెట్టారు. ఆనాటి నుంచే కాంగ్రెస్ చీలి పోయింది.
Also Read : ఆమె గెలిస్తే మంత్రిగా ఉండను – సునక్