NGO’S FCRA : ఫారిన్ ఫండింగ్ కు సంబంధించి కేంద్ర సర్కార్ నిర్దేశించిన ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ – ఎఫ్‌సీఆర్ఏ ( NGO’S FCRA )లైసెన్స్ పర్మిషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే లెక్కా పత్రం లేని సంస్థల బాగోతాలను బట్ట బయలు చేసింది. ఇబ్బడి ముబ్బడిగా స్వచ్చంధ సంస్థలకు విదేశాల నుంచి నిధులు రావడాన్ని పసిగట్టింది కేంద్రం.
ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్జీఓల వివరాలు, కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఫండింగ్ వివరాల గురించి ఆరా తీసింది. దీంతో ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.
ఇవాళ పార్లమెంట్ లో ఎన్జీఓలు, కార్యకలాపాలు, ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ పునరుద్దరణపై చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. 2020 నుంచి విదేశీ నిధుల లైసెన్స్ పునరుద్దరణను( NGO’S FCRA )తిరస్కరించడం జరిగిందని తెలిపారు.
2021 డిసెంబర్ లో ఆక్స్ ఫామ్ ఇండియా దరఖాస్తును కూడా తిరస్కరించినట్లు వెల్లడించారు. అయితే బ్రిటన్ సర్కార్ ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఆయా పత్రాలను పరిశీలించిన తర్వాత ఎఫ్‌సీఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 179 సంస్థల లైసెన్సులు రద్దు చేసినట్లు వెల్లడించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
విదేశీ నిధులను స్వీకరించేందుకు తప్పనిసరి అయిన లైసెన్సుల పునరుద్దరణకు దరఖాస్తు చేయక పోవడంతో 5 వేల 789 సంస్థలను ఎఫ్‌సీఆర్ఏ పరిధి నుంచి తొలగించినట్లు తెలిపింది.
ఇంకా కొన్నింటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు గత వారం గడువును జూన్ 30 వరకు పొడిగించింది కేంద్ర సర్కార్.
Also Read : నవాబ్ మాలిక్ ఫ్లాట్లపై ఈడీ ఆరా