Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ లోని రెడ్ కారిడార్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు భారీ ఎన్ కౌంటర్లలో నలభైకి పైగా కామ్రెడ్ లను కోల్పోయిన మావోయిస్టులకు… తాజాగా మరో 50 మంది మావోయిస్టులు భారీ ఝలక్ ఇచ్చారు. బీజాపుర్ జిల్లాలో ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట ఆదివారం మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ బాడీగార్డు సోనూ హేమ్లాతో సహా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. పీఎల్‌జీఏ బెటాలియన్ నంబరు-1కు చెందిన ఒకరు, కంపెనీ నంబరు-2 నుంచి నలుగురు, కంపెనీ నంబరు-7 నుంచి ఒకరు, నేషనల్ పార్క్ కుతుల్ ఏరియా కమిటీ ప్లాటూన్ నంబరు-2 నుంచి ఇద్దరు సభ్యులు, పార్టీ ఇతర విభాగాలకు చెందిన వారు లొంగిపోయిన వారిలో ఉన్నారు. వారిలో ఆరుగురిపై రూ.8 లక్షల, 13మందిపై రూ.68 లక్షల రివార్డ్ ఉంది.
Chhattisgarh Encounter
మావోయిస్టు(Maoists) సిద్ధాంతాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకువడం, వారి సీనియర్ కేడర్ స్థానిక గిరిజనుల్ని దోచుకోవడం, అంతర్గత విభేదాల కారణంగా వారు పోలీసుల ముందు లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి పునరావసం కల్పిస్తామని చెప్పారు. తక్షణ సాయంగా రూ.25వేల చొప్పున చెక్కులను వారికి అందించారు. ఇది ప్రభుత్వ పునరావాస విధానంతో పాటు భద్రతా బలగాల విజయమని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పేర్కొన్నారు.
ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 134 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. వీరిలో 118 మంది బస్తర్ డివిజన్‌లోనే మృతి చెందారు. 2024లో బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో కలిపి మొత్తం 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మార్చి 31, 2026లోపు నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఆ దిశగా మావోయిస్టులను ఏరిపారేస్తుంది. శనివారం శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు రెండు ప్రాంతాల్లో జరిపిన ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులను మట్టుబెట్టాయి. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఆ భారీ ఎన్‌కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలో మావోయిస్టులు లొంగిపోయారు.
Also Read : CBI: సీబీఐ వలకు చిక్కిన బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్