KTR : దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR). రాష్ట్రానికి ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో మరో ఐటీ పార్కు నిర్మాణం కానుందన్నారు.
రూ. 100 కోట్ల ఖర్చుతో మేడ్చల్ లో నిర్మించనున్న ఐటీ పార్కుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇవాళ మనందరికీ ప్రధానంగా నాలుగు కోట్ల ప్రజానీకానికి శుభదినం అని పేర్కొన్నారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన, సీఎం కేసీఆర్(KTR) పుట్టిన రోజున ఐటీ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని చెప్పారు.
ఏదైనా సాధించాలంటే ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉండాలన్నారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ లో ఉన్నాయని అన్నారు. అందుకే రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి దేశం గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.
ఏదైనా సాధించాలంటే గోల్ పూర్తి చేయాలంటే కృషితో పాటు పట్టుదల కూడా ఉండాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఐటీ హబ్ గా, ఫార్మా హబ్ గా, అగ్రి హబ్ గా మారి పోయిందన్నారు.
ఇది తెలంగాణ రాష్ట్రం గర్వించ దగిన అంశం అన్నారు మంత్రి కేటీఆర్. ఈ తరుణంలో కొత్త పరిశ్రమలు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ విస్తరిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
కరోనా కారణంగా పనులు ఆలస్యంగా అవుతున్నట్లు తెలిపారు. ఈ ఐటీ పార్కుతో 50 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు.
Also Read : అవార్డు అందుకున్న రతన్ టాటా