Nirmala Sitharaman : టెలికాం రంగంలో 5జీ పెను సంచలనం
ఇతర దేశాలకు అందించ గల సత్తా
Nirmala Sitharaman : ప్రపంచ టెలికాం రంగంలో భారత్ ఊహించని స్థాయికి చేరుకుందని కితాబు ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని రంగాలకు సాంకేతికత అన్నది అత్యవసరంగా మారిందన్నారు. దీనిని ఉపయోగించు కోవాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాల్సిందేనని లేక పోతే పనులు సాగవని పేర్కొన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని భారత్ ముందస్తుగా ఊహించని రీతిలో టెలికాం సెక్టార్ లో విస్తు పోయేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. 5జీ సర్వీసులను ప్రస్తుతం అందజేస్తోందని , ఇది పూర్తిగా భారత్ తయారు చేసిందేనని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman). మా దేశంలో తాము ప్రారంభించిన పూర్తి స్వంతంతో కూడుకున్న సాంకేతికత ఇది అని పేర్కొన్నారు.
5జీ అనేది స్వదేశీ సాంకేతికతకు నిదర్శనమని తెలిపారు నిర్మలా సీతారామన్. దీనిని భారత దేశం ఇతర దేశాలకు అందించే స్థాయికి చేరుకుందన్నారు కేంద్ర మంత్రి.
ఇదిలా ఉండగా దేశీయంగా అభివృద్ది చేసిన 5జి మౌలిక సదుపాయాలను ప్రారంభించిందని , దానిని కూడా ఇతర దేశాలతో కూడా పంచుకునేందుకు రెడీగా ఉందని కుండ బద్దలు కొట్టారు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman).
జాన్స్ హాప్ కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇంటర్నేషనల్ స్టీడీస్ లో విద్యార్థులతో సంభాషించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి. కాగా ఇంకా 5జీ సేవలు అట్టడుగు స్థాయి వరకు వెళ్ల లేదని స్పష్టం చేశారు.
త్వరలోనే దానిని కూడా అందుకునే ప్రయత్నం చేస్తామంటూ చెప్పారు. 5జీ సాంకేతికత అనేది తాము సాధించిన విజయాలలో ఒకటిగా అభివర్ణించారు.
Also Read : ‘హిజాబ్’ పై రాజ్యాంగ ధర్మాసనం అవసరం