Adar Poonawala : 6 మిలియ‌న్ల కోవ్యాక్సిన్లు రెడీ

అదార్ పూనా వాలా వెల్ల‌డి

Adar Poonawala : దేశ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌తి రోజూ 10,000 వేల‌కు పైగా కొత్త‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌త 10 రోజుల నుంచి ఈ కేసుల తీవ్ర‌త పెరుగుతోంది. దీంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఈ మేర‌కు కేంద్రం కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అంతే కాదు మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

ఈ త‌రుణంలో క‌రోనా కార‌ణంగా ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు మూడో డోస్ కూడా వేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది కేంద్రం. ఈ సంద‌ర్బంగా వ్యాక్సిన్ల త‌యారీలో టాప్ లో ఉన్న సీర‌మ్స్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ముంబై చైర్మ‌న్ , సిఇఓ అదార్ పూనావాలా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం త‌మ వ‌ద్ద 6 మిలియ‌న్ల కోవో వాక్స్ డోస్ లు రెడీగా ఉన్నాయ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కొత్త‌గా 67 వేల 556 కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది కేంద్రం.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో పెరుగుతున్న క‌రోనా వైర‌స్ వ‌ల్ల పూనా వాలా(Adar Poonawala) శ‌నివారం ముంబైలో మాట్లాడారు. ప్ర‌స్తుతం కోవిడ్ ప్ర‌మాద‌క‌ర స్థాయిలో లేద‌న్నారు. కానీ ఏది ఏమైనా త‌ట్టుకుని నిల‌బ‌డేందుకు అవ‌స‌ర‌మ‌ని తాము వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసి ఉంచామ‌న్నారు

Also Read : దేశంలో కొత్త‌గా 12,193 కేసులు

Leave A Reply

Your Email Id will not be published!