Income Tax Return : 7 కోట్ల 40 ల‌క్ష‌ల మంది ఐటీ రిట‌ర్న్

140 కోట్ల భార‌తీయ జ‌నాభా

Income Tax Return : కేంద్ర ప్ర‌భుత్వాన్ని విస్తు పోయేలా చేసింది ఐటీ దాఖ‌లు చేసిన వారి సంఖ్య‌ను చూసి. భార‌తీయ జ‌నాభా 140 కోట్లు ప్ర‌స్తుతం. కానీ ఆదాయ‌పు ప‌న్ను శాఖకు సంబంధించి రిట‌ర్న్(Income Tax Return) దాఖ‌లు చేసిన వారి సంఖ్య కేవ‌లం 7 కోట్ల 40 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే ఉండ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మొత్తం జ‌నాభా ప‌రంగా చూస్తే ఆదాయ‌పు ప‌న్ను చెల్లించిన వారి సంఖ్య కేవ‌లం 5.3 శాతం కావ‌డం గ‌మ‌నార్హం.

Income Tax Return Filing

ఇక దేశ వ్యాప్తంగా ఐటీ చెల్లింపులు చేసిన రాష్ట్రాల‌లో టాప్ లో మూడు రాష్ట్రాలు నిలిచాయి. వాటిలో నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ ద‌క్కించుకుంది మ‌హారాష్ట్ర స్టేట్. 1.14 కోట్లు చెల్లించింది. ఇక రెండో స్థానంలో మోదీ స్వ‌స్థలం గుజరాత్ నిలిచింది. 74 ల‌క్ష‌లు మాత్ర‌మే చెల్లింపులు ఉండ‌డం విశేషం. ఇక యోగి ఆదిత్యానాథ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రం మూడో స్థానం ద‌క్కించుకుంది. ఈ రాష్ట్రం 71. 66 ల‌క్ష‌లు మాత్ర‌మే.

ఐటీ రిట‌ర్న్ త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రాల‌లో పంజాబ్ 36, ఢిల్లీ 37, త‌మిళ‌నాడు 45.9 ల‌క్ష‌లు, క‌ర్ణాట‌క 42.58 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉన్నాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. మొత్తంగా ఇన్ని కోట్ల సంప‌ద ఎవ‌రి ద‌గ్గ‌ర ఉందో తెలియాల్సిన అవ‌స‌రం ఉంది. ఐటీ రిట‌ర్న్ అనేది స్వ‌చ్చంధంగా వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌నేది గుర్తించాలి.

Also Read : Payam Meenaiah : 40 మంది పిల్ల‌ల‌ను కాపాడిన టీచ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!