74th Republic Day : సమున్నత భారతం గణతంత్ర దినోత్సవం
దేశమంతటా 74వ రిపబ్లిక్ వేడుకలు
74th Republic Day : యావత్ భారత దేశం అంతటా జనవరి 26న గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇప్పటికే దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచానికే భారత దేశం ఆదర్శ ప్రాయంగా నిలిచిందని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజున రిపబ్లిక్ డేను(74th Republic Day) జరుపు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు మనమందరం రుణపడి ఉండాలని పేర్కొన్నారు ద్రౌపది ముర్ము. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కేంద్ర సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి జరిగే రిపబ్లిక్ వేడుకలకు(74th Republic Day) ముఖ్య అతిథిగా ఈజిప్టు దేశ అధ్యక్షుడు ఎల్ సీసీ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా భారత దేశానికి చెందిన త్రివిధ దళాలు తమ ప్రదర్శన చేపట్టనున్నాయి. ధైర్య సాహసాలను ప్రదర్శించనున్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం లాగే 2022 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన పద్మ పురస్కారాలను ప్రకటించింది.
ఆరు పద్మ విభూషణ్ , 9 పద్మ భూషణ్ , 95 పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఇక భారత రాజ్యాంగం జనవరి 26, 1050లో అమలులోకి వచ్చింది. భారత దేశం సార్వ భౌమ రాజ్యంగా అవతరించింది. ఈ ఏడాది కర్తవ్య మార్గ్ లో వేడుకలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రముఖులు చెప్పిన సందేశాలు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసం అనేది తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు కాంతిని అనుభవించే పక్షి అని పేర్కొన్నారు విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్.
కనికరం లేని విమర్శ, స్వతంత్ర , విప్లవాత్మక ఆలోచన రెండూ అవసరమైన లక్షణాలు అని స్పష్టం చేశారు సర్దార్ షహీద్ భగత్ సింగ్. మహిళలు సాధించిన పురోగతిని బట్టి నేను సంఘం పురోగతిని కొలుస్తానని పేర్కొన్నారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.
స్వరాజ్యం నా జన్మ హక్కు దాని కోసం అవసరమైతే నా ప్రాణాలను ఇస్తానని ప్రకటించిన బాల గంగాధర తిలక్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు.
Also Read : అంబేద్కర్ కు రుణపడి ఉన్నాం – ముర్ము