YS Jagan : ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి సోపానం
రైతులకు పిలుపునిచ్చిన సీఎం జగన్ రెడ్డి
YS Jagan : రైతులకు ఎంతో లాభదాయకం ప్రకృతి వ్యవసాయమని పిలుపునిచ్చారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఇందుకు సంబంధించి అన్ని విధాలుగా రైతులకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు.
వైఎస్సార్ కడప జిల్లాలో గురువారం పర్యటిస్తున్నారు. పులివెందులలో ఏపా కార్ల్ వద్ద న్యూటెక్ బయో సైన్సెస్ కు శంకుస్థాపన చేశారు సీఎం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
గతంలో వ్యవసాయం దండగ అనే వారని కానీ ఈ రంగం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు సీఎం. తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వెల్లడించారు జగన్ రెడ్డి(YS Jagan). ప్రస్తుతం వర్షాకాలం రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామాల్లోని వాలంటీర్లు అందుబాటులో ఉండాలని సూచించారు.
అంతే కాకుండా అగ్రికల్చర్ కు సంబంధించిన శాస్త్రవేత్తలు మరింతగా లోతైన పరిశోధనలు చేయాలని, రైతులకు మేలు చేకూర్చేలా అధిక దిగుబడులు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
గ్రామ స్థాయి నుంచి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం పెద్ద మొత్తంలో సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు సీఎం.
Also Read : క్లియరెన్స్ సరే జాబ్స్ భర్తీ మాటేంటి