JEE Main 2022 : జేఈఈ మెయిన్ తొలి విడ‌త‌లో మ‌నోళ్లే టాప్

తెలంగాణ..ఏపీ నుంచి ఆరుగురు

JEE Main 2022 : దేశ వ్యాప్తంగా ఎంతో పోటీ ఉండే ఏకైక ప‌రీక్ష జేఈఈ ప‌రీక్ష‌. ఈసారి జేఈఈ మెయిన్ తొలి విడ‌త ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. తెలంగాణ స్టేట్ నుంచి ముగ్గురు ఏపీ నుంచి మ‌రో ముగ్గురు టాప్ లో నిలిచి స‌త్తా చాటారు.

ఓపెన్ , ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేట‌గిరీల్లోనూ టాప్ లో నిలిచారు. దేశంలోని 14 మందికి వంద‌కు వంద శాతం ఎన్టీఏ స్కోర్ సాధించ‌డం విశేషం.

ఈ ప‌రీక్ష ప్ర‌ధానంగా ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల‌, ఇత‌ర జాతీయ స్థాయిలోని ఇంజ‌నీరింగ్ కాలేజీల‌లో ప్ర‌వేశాల‌కు గాను జేఈఈ మెయిన్ -2022 మొద‌టి విడ‌త ఫ‌లితాలు విడుద‌లయ్యాయి.

తెలంగాణ‌కు చెందిన జాస్తి య‌శ్వంత్ , అనికేత్ చ‌టోపాధ్యాయ‌, దీర‌జ్ కురుకుండ‌, రూపేష్ బ‌యానీ టాప్ లో నిల‌వ‌గా ఏపీకి చెందిన సుహాస్ , ర‌వి కిషోర్ , పోలిశెట్టి కార్తికేయ వంద శాతం ఎన్టీయే స్కోర్ సాధించారు.

హ‌రియాణా, జార్ఖండ్ , పంజాబ్ , అస్సాం, రాజ‌స్థాన్, క‌ర్ణాట‌, యూపీకి చెందిన విద్యార్థులు స‌త్తా చాటారు. మొత్తం 14 మంది టాప‌ర్లుగా ఉన్నారు.

ఇక జేఈఈ మెయిన్ తొలి విడ‌త ప‌రీక్ష గ‌త నెల జూన్ 24 నుంచి 30 దాకా దేశ వ్యాప్తంగా 588 కేంద్రాల‌లో ప‌రీక్ష నిర్వ‌హించారు. మొత్తం 8,72,432 మంది ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

వీరిలో 7.69 ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ల‌క్ష‌న్న‌ర మంది దాకా హాజ‌ర‌య్యారు. ఇక రెండో విడ‌త ప‌రీక్ష ఈనెల 24 నుంచి 30 దాకా జ‌ర‌గ‌నుంది.

మ‌రో వైపు ఎస్సీ, బీసీ గురుకులాల‌కు చెందిన స్టూడెంట్స్ స‌త్తా చాట‌డం విశేషం.

Also Read : విదేశీ విద్యా దీవ‌నెకు లైన్ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!