India Refutes : గోట‌బ‌య వెళ్లేందుకు స‌పోర్ట్ చేయ‌లేదు

స్ప‌ష్టం చేసిన భార‌త దేశ ప్ర‌భుత్వం

India Refutes : శ్రీ‌లంక‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు తాము బాధ్య‌త వ‌హించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది భార‌త ప్ర‌భుత్వం. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు వేలాదిగా త‌ర‌లి వ‌చ్చి ఆ దేశ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే రాజ భ‌వ‌నంను ముట్ట‌డించారు.

దెబ్బ‌కు ఆర్మీ స‌హ‌కారంతో ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నారు. ఆయ‌న స్వంత సోద‌రుడు మాజీ ప్ర‌ధాన మంత్రి మ‌హింద రాజ‌ప‌క్సే కూడా అక్క‌డే ఉన్నారు.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు ఆర్మీ స‌హ‌కారంతో మాల్దీవుల‌కు గోట‌బ‌య రాజ‌ప‌క్సే త‌న ఫ్యామిలీ, సెక్యూరిటీతో క‌లిసి చెక్కేశారు. కాగా శ్రీ‌లంక‌లోని విప‌క్షాలు పెద్ద ఎత్తున భార‌త ప్ర‌భుత్వంపై(India Refutes) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాయి.

గోట‌బ‌య రాజ‌ప‌క్సే పారి పోయేందుకు భార‌త్ స‌పోర్ట్ చేసింద‌ని మండిప‌డ్డారు. దీంతో శ్రీ‌లంక‌లో భార‌త హైక‌మిష‌న్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే కంటే ముందు సంక్షోభంలో ఉన్న ద్వీప దేశం శ్రీ‌లంక నుంచి ప‌రార్ అయ్యారు.

గోట‌బ‌య స‌జావుగా వెళ్లేందుకు త‌మ స‌ర్కార్ దోహ‌దం చేసింద‌న్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని హైక‌మిష‌న్ ట్వీట్ లో పేర్కొంది. ప్ర‌స్తుతం సంక్షోభంలో ఉన్న శ్రీ‌లంక త్వ‌ర‌గా కోలుకోలేని తాము కోరుకుంటున్నాం.

అక్క‌డ ప్ర‌జాస్వామ్య మార్గాలు, విలువ‌లు ఉండేలా చూడాల‌ని ఆశిస్తుంది ప్ర‌భుత్వం. శ్రీ‌లంక ప్ర‌జ‌ల‌కు భార‌త దేశం సంపూర్ణ మ‌ద్ద‌తును కొన‌సాగిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది భారత హైక‌మిష‌న్ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా దేశ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ పూర్తి ఆమోదం పొందాక గోట‌బ‌య రాజ‌ప‌క్సే , భార్య‌, ఇద్ద‌రు సెక్యూరిటీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లిన‌ట్లు శ్రీ‌లంక ధ్రువీక‌రించింది.

Also Read : గోట‌బ‌య గుడ్ బై మాల్దీవుల‌కు ప‌రార్

Leave A Reply

Your Email Id will not be published!