Supreme Court : 15న అగ్నిప‌థ్ పై సుప్రీంకోర్టు తీర్పు

స్కీం భ‌ర్తీపై కోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు

Supreme Court : కేంద్ర ర‌క్ష‌ణ ద‌ళాల‌లో తాత్కాలిక భ‌ర్తీ కోసం అగ్నిప‌థ్ స్కీంను తీసుకు వ‌చ్చింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. దీనిని స‌వాల్ చేస్తూ ప‌లు పిటిష‌న్లు సుప్రీంకోర్టులో(Supreme Court) దాఖ‌ల‌య్యాయి.

ఈ దావాల‌పై ఈనెల 15న విచార‌ణ చేప‌ట్ట‌నుంది కోర్టు. 15 ఏళ్ల పాటు రెగ్యుల‌ర్ కేడ‌ర్ లో 25 శాతం మందిని కొన‌సాగించాల‌నే నిబంధ‌న‌తో కేవ‌లం నాలుగు సంవ‌త్స‌రాల పాటు మ‌హిళతో స‌హా సైనికుల‌ను నియ‌మించేందుకు న‌రేంద్ర మోదీ అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది.

ప‌ర్మినెంట్ ప‌ద్ధ‌తిన సాయుధ ద‌ళాల్లో భ‌ర్తీ చేయాల్సి ఉండ‌గా తాత్కాలిక ప‌ద్ద‌తిని తీసుకు రావ‌డాన్ని ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల‌లో నిర‌స‌న‌లు మిన్నంటాయి. ప‌లు చోట్లు రైలు బోగీల‌ను ద‌గ్దం చేశారు. బ‌స్సుల అద్దాల‌ను ధ్వంసం చేశారు.

ఇక కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు ఈనెల 15న శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

న్యాయ‌మూర్తులు డీవై చంద్రచూడ్ , ఏఎస్ బోప‌న్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ అంశాన్ని ప‌రిశీలిస్తోంది. ఇదిలా ఉండ‌గా అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని గ‌త జూన్ లో మోదీ స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టింది.

కాగా అగ్నిప‌థ్ స్కీంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చే తుది తీర్పు కోసం దేశం యావ‌త్తు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తోంది. విప‌క్షాలు మాత్రం బేష‌ర‌తుగా స్కీంను ర‌ద్దు చేయాల‌ని కోరాయి.

ఈనెల 18 నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్ర‌ధానంగా అగ్నిప‌థ్ స్కీంపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Also Read : రాష్ట్ర‌ప‌తి కోసం బీజేపీ ఆదివాసీ జ‌పం

Leave A Reply

Your Email Id will not be published!