Sri Lanka Curfew : తుపాకుల మోత‌ క‌నిపిస్తే కాల్చివేత

శ్రీ‌లంక‌లో తారా స్థాయికి సంక్షోభం

Sri Lanka Curfew : శ్రీ‌లంక‌లో ప‌రిస్థితి చేయి దాటి పోతోంది. సంక్షోభం ముదిరి పాకాన ప‌డింది. ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు. గ‌త కొన్ని నెల‌లుగా దేశంలో ఆహార‌, ఆర్థిక‌, ఆయిల్, విద్యుత్, గ్యాస్ సంక్షోభం నెల‌కొంది. ల‌క్ష‌లాది జ‌నం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఇప్ప‌టికే తిండి దొర‌క‌క 100 మందికి పైగా ఆక‌లి చావుల‌కు గుర‌య్యారు. క‌డుపు మండిన జ‌నం ఏకంగా రాజ భోగాలు అనుభ‌విస్తున్న దేశ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే భ‌వ‌నాన్ని ముట్ట‌డించారు.

అక్క‌డే ఆందోళ‌న‌కారులు తిష్ట వేశారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి ర‌ణిలె విక్రమ సింఘే ఇంటికి నిప్పంటించారు. ఆయ‌న‌కు చెందిన వాహ‌నాలు ధ్వంసం చేశారు.

దీంతో తాను కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ర‌ణిలే. విప‌క్షాల‌తో స‌ర్కార్ ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఇదే స‌మ‌యంలో జ‌నం ఆగ్ర‌హంతో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన ప్రెసిడెంట్ త‌న భార్య‌, అంగ‌ర‌క్ష‌కుల‌తో క‌లిసి ఆర్మీ స‌హ‌కారంతో మాల్దీవుల‌కు చెక్కేశాడు.

అయితే అత‌డు పారి పోయేందుకు భార‌త్ స‌హ‌క‌రించిందంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ త‌రుణంలో ప్రెసిడెంట్, ప్ర‌ధాని రాజీనామా చేసిన స‌మ‌యంలో పార్ల‌మెంట్ స్పీక‌ర్ రాజ్యాంగ‌బ‌ద్దంగా అధ్య‌క్షుడిగా ఉంటాడు.

కానీ ఉన్న‌ట్టుండి తాత్కాలిక దేశ అధ్య‌క్షుడిగా గోట‌బయ రాజీనామా చేయ‌డంతో ఆయ‌న స్థానంలో ర‌ణిలె విక్ర‌మ సింఘే ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్ర‌ధాని హోదాలోనే ఆయ‌న దేశంలో ఎమ‌ర్జెన్సీ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున బ‌ల‌గాలు మోహ‌రించాయి. కాల్పుల మోత‌తో శ్రీ‌లంక(Sri Lanka Curfew) ద‌ద్ద‌రిల్లుతోంది. క‌నిపిస్తే కాల్చే వేయాలంటూ ర‌ణిలె ఆదేశాలు జారీ చేయ‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.

Also Read : శ్రీ‌లంక‌లో ఎమ‌ర్జెన్సీ డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!