Sri Lanka President : తదుపరి శ్రీలంక అధ్యక్షుడిపై ఉత్కంఠ
చీఫ్ రేసులో ముగ్గురు కీలక నేతలు
Sri Lanka President : లంకేయుల ప్రజాగ్రహం ముందు దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తలవంచక తప్పలేదు. దేశం నుంచి మాల్దీవులకు దొడ్డి దారిన చెక్కేశాడు. అక్కడ కూడా తనపై దాడి జరుగుతుందన్న భయంతో సింగపూర్ కు వెళ్లాడు.
రాజీనామా చేయకుండా నాన్చుతూ వచ్చిన గోటబయకు దేశంలో తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది.
తన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత ప్రధాన మంత్రిగా ఉన్న రణిలే విక్రమ సింఘేను గోటబయ నియమించడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
అంతే కాదు పీఎం ఆఫీసులోకి చొరబడ్డారు. జాతీయ జెండాలను ఎగుర వేశారు. విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు
తాత్కాలిక చీఫ్ రణిలే.
తాజా పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా(Sri Lanka President) ఎవరు ఎంపిక అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు రాజపక్సే.
ఈ మేరకు పార్లమెంట్ స్పీకర్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. 225 మంది సభ్యులు దేశ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. గత నెల రోజుల
నుంచి శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారాయి.
ఆర్థిక, ఆహార, ఆయిల్, గ్యాస్, విద్యుత్ సంక్షోభం తారా స్థాయికి చేరింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ గా ఉన్న రణిలే ప్రెసిడెంట్
రేసులో ఉన్నట్లు సమాచారం.
విక్రమ సింఘే పార్టీకి పార్లమెంట్ లో ఒకే ఒక్క సీటు ఉన్నప్పటికీ అధ్యక్షుడి సోదరుడు బాసిల్ రాజపక్సే తో సహా శ్రీలంక అధికార శ్రీలంక
పొదుజన పెరమున లోని వర్గాలు ఆయనకు మద్దతు ఇస్తున్నాయి.
కాగా దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లపై దేశ ఆర్థిక మంత్రిగా పని చేసిన విక్రమ సింఘేకు మంచి పట్టు ఉందని ఆ పార్టీ భావిస్తోంది.
Also Read : ప్రజల ఆస్తులను ధ్వంసం చేయొద్దు
ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమగి జన బలవేగయ (ఎస్జేబీ ) పార్టీ నాయకుడు సజిత్ ప్రేమ దాస కూడా పోటీలో ఉన్నారు. ఆయనకు కేవలం 50 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది.
గెలవాలంటే ఇరు పార్టీల మద్దతు కావాల్సి ఉంటుంది. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు. తండ్రి హత్యకు గురయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు.
2018లో గృహ నిర్మాణ, సాంస్కృతిక శాఖతో పాటు 2000లో డిప్యూటీ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు. మూడో వ్యక్తి ఎస్ఎల్పీపీ సీనియర్ లీడర్ అలహప్పెరుమ ప్రెసిడెంట్ రేసులో ఉన్నాడు.