Godavari Floods : జల దిగ్బంధంలో భద్రాచలం
ఉగ్ర రూపం దాల్చిన గోదావరి
Godavari Floods : గతంలో ఎన్నడూ లేనంతగా భద్రాచలం పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకుంది. బాహ్య ప్రపంచంతో ఒక్కసారిగా బంధం తెగి పోతోందోనన్న ఆందోళన నెలకొంది.
ఆనాడు తన రాముడి కోసం కంచర్ల గోపన్న కట్టించిన భద్రాచలం గుడి కూడా మునిగి పోయే పరిస్థితి నెలకొనడం ఒకింత విస్తు పోయేలా చేసింది. మరో వైపు బాసర వద్ద గోదావరమ్మ(Godavari Floods) శాంతించి అంటూ పూజలు చేసినా ఫలించలేదు.
నిండు కుండలా కదులుతూనే ఉంది. ఎక్కడ చూసినా నీళ్లే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. నైరుతి రుతు పవనాల కారణంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి.
మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ , ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గోదావరి ఎప్పుడు ముంచుతుందోనంటూ జనం బిక్కుబిక్కుమంటున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు.
రాత్రి 12 గంటల తర్వాత ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది ఉగ్ర గోదావరి (Godavari Floods). ఏకంగా 72 అడుగులకు పైగా చేరింది. 1986 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ప్రవహించడం.
పరిస్థితి చేయి దాటి పోయేలా ఉండడంతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీంలు దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు గాను ఆర్మీ హెలికాప్టర్ ను భద్రాచలంలో సిద్దంగా ఉంచారు. టూరిజం, అగ్నిమాపక శాఖకు చెందిన బోట్లతో రెడీగా ఉండాలని ఆదేశించారు. మరిన్ని బలగాలను పంపాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
Also Read : గోదారమ్మ ఆగ్రహం క్షణం క్షణం భయం
భద్రాచలంలో ఉగ్రగోదారి.. 70 అడుగులు దాటిన వరద. పలు కాలనీల్లోకి భారీగా చేరిన వరద నీరు.. #badrachalam #TelanganaFloods #Telanganarains #HeavyRains #floods #Godavari pic.twitter.com/0ULcpS1aGG
— naveen kumar reddy (@reddynavenreddy) July 15, 2022