Imran Khan : ఇమ్రాన్ ఖాన్ పై విచార‌ణ‌కు క‌మిటీ

దేశ ద్రోహ నేరారోప‌ణ‌ల‌పై కేబినెట్ ఆమోదం

Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఇయ‌న‌పై దేశ ద్రోహ నేరారోప‌ణ‌లను ఉద్దేశించి పాకిస్తాన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు పాకిస్తాన్ దేశ స‌మ‌చార శాఖ మంత్రి ఔరంగ జేబ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ పై విచార‌ణ‌కు సంబంధించి న్యాయ శాఖ మంత్రి అజం న‌జీర్ త‌రార్ ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపంద‌న్నారు.

పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చైర్మ‌న్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తో పాటు ఇత‌ర అగ్ర నాయ‌క‌త్వంపై ఆర్టిక‌ల్ 6 ప్ర‌కారం దేశ ద్రోహ చ‌ర్య‌లు ప్రారంభించాలా వ‌ద్దా అనే దానిపై చ‌ర్చించేందుకు క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది.

ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ క్యాబినెట్ శుక్ర‌వారం ఆమోదం తెలిపింది. నాటి ప్ర‌ధాన మంత్రిపై అవిశ్వాస తీర్మానంపై నేష‌న‌ల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీక‌ర్ ఖాసిం సూరి ఇచ్చిన తీర్పున‌కు సంబంధించి సుమోటోగా దాఖ‌లు చేసిన కేసులో సుప్రీంకోర్టు వివ‌ర‌ణాత్మ‌క తీర్పును మంత్రివ‌ర్గం స్వాగ‌తించ‌డం విశేషం.

ఇందులో ఇమ్రాన్ ఖాన్ రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించారంటూ కోర్టు పేర్కొంది. ఇంత‌కు ముందు కూడా దేశ రాజ్యాంగాన్ని ర‌ద్దు చేసినందుకు ఇమ్రాన్ ఖాన్ దేశ ద్రోహి ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌చ్చ‌ని ఫెడ‌ర‌ల్ మంత్రి పేర్కొన్నారు.

జ‌స్టిస్ మ‌జ‌హ‌ర్ ఆలం ఖాన్ మియాంఖెల్ , అధ్య‌క్షుడు ఆరిఫ్ అల్వీ, అప్ప‌టి ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్, అప్ప‌టి నేష‌న‌ల్ అసెంబ్లీ స్పీక‌ర్ అస‌ద్ ఖైజ‌ర్, మాజీ డిప్యూటీ స్పీక‌ర్ సూరి, మాజీ న్యాయ మంత్రి ఫ‌వాద్ చౌద‌రి త‌మ అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ స్ప‌ష్టం చేసింది.

Also Read : ప్ర‌జ‌ల ఆస్తుల‌ను ధ్వంసం చేయొద్దు

Leave A Reply

Your Email Id will not be published!