IIT Madras Director : ఐఐటీ మద్రాస్ కు ప్రపంచ గుర్తింపు
డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామ కోటి సంతోషం
IIT Madras Director : ప్రతి ఏటా దేశంలో నేషనల్ ఇనిస్టిట్యూట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్ ) విద్యా సంస్థల పనితీరు, విద్యా బోధన, ఫలితాలు, తదితర వాటిని ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్స్ ఇస్తూ వస్తోంది.
తాజాగా 2022 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఓవరాల్ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ నెంబర్ వన్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఇండియిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్(IIT Madras Director) కామ కోటి స్పందించారు.
తమకు సంతోషం కలిగిస్తోందన్నారు. ఇది తమ సంస్థ సాధించిన ప్రగతికి నిదర్శమని పేర్కొన్నారు. ఓవరాల్ కేటగిరీకి సంబంధించి వరుసగా నాలుగోసారి టాప్ ర్యాంకింగ్ నిలుపు కోవడం తమకు సంతోషం కలిగిస్తోందని చెప్పారు.
ర్యాంకింగ్స్ వెలువడిన అనంతరం కామకోటి మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ల అంకిత భావం, బోధనా పద్దతుల్లో అత్యాధునిక టెక్నాలజీ వాడడం, భావి భారత ఐఐటీయన్లుగా తీర్చిదిద్దడంపైన ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు.
ఇది అందరి సహకారం, తోడ్పాటు వల్లనే ప్రతి ఏటా ర్యాంకింగ్ సాధించేందుకు వీలు కలిగిందని చెప్పారు కామకోటి. విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చాక ఈ స్ట్రీమ్ లైన్ లో ఇమిడి పోయేలా చేయడంలో ప్రొఫెసర్ల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు.
దీని వల్ల ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా ఉంటారని స్పష్టం చేశారు. పరిశోధనలు విస్తృతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఇది నిరంతరం కొనసాగుతూ వస్తోందని కామకోటి చెప్పారు.
వ్యవస్థాపకత, ఆవిష్కరణలు, పరిశోధన ఈ మూడింటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు.
Also Read : ఐఐటీ మద్రాస్..ఐఐఎస్ బెంగళూరు టాప్