Kid Salute Viral : జవాన్లకు వందనం చిన్నారికి సలాం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
Kid Salute Viral : దేశభక్తి గురించి పదే పదే చెప్పాల్సి వస్తోంది నేటి టెక్నాలజీ యుగంలో. సెల్ ఫోన్ మాయలో పడి యువత తన విలువైన కాలాన్ని, దేశం పట్ల ఉండాల్సిన కనీస గౌరవాన్ని కూడా మరిచి పోతున్న తరుణంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
వాళ్లు చూస్తే జవాన్లు. భుజాల మీద తుపాకులు ఉన్నాయి. పెద్దవాళ్లే వాళ్ల వద్దకు వెళ్లేందుకు జంకుతారు. మాట్లాడాలంటే భయ పడతారు. కానీ పట్టుమని మూడేళ్లు కూడా ఉండని ఆ చిన్నారి మాత్రం ఎలాంటి జంకు లేకుండా వాళ్ల వద్దకు వెళ్లింది.
అంతేనా తమలో తాము మాట్లాడుకుంటున్న వారిలో ఒక జవాను వద్దకు చేరింది. ఆపై జవాను పలకరించే లోపు అతడి కాళ్లకు నమస్కారం చేసింది. ప్రస్తుతం ఆ చిన్నారి చేసిన పనిని చూసి ప్లాట్ ఫామ్ మీద ఉన్న జవాన్లంతా ఒక్కసారిగా విస్తు పోయారు.
ఆ పాప(Kid Salute Viral) చేసిన మంచి పనిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ దేశంలో ఇంకా మానవత్వం బతికే ఉందని, దేశం కోసం అహర్నిశలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జవాన్ల పట్ల తమ ప్రేమ, అభిమానం చెరిగి పోలేదని చాటి చెప్పింది ఆ చిన్నారి.
ఇప్పుడు దేశం యావత్తు ఆ చిన్నారి చేసిన పనిని చూసి తలుచుకుంటోంది. అవును మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. గౌరవించడానికి, ప్రేమించడానికి వయస్సు, కులం, మతం, ప్రాంతంతో సంబంధం ఏమీ లేదని నిరూపించింది.
ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను భారతీయ జనతా పార్టీకి చెందిన సెంట్రల్ బెంగళూరు ఎంపీ పీసీ మోహన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
Also Read : ఐఐటీ మద్రాస్ కు ప్రపంచ గుర్తింపు
Raising patriotic young minds is a duty every parent owes to this great nation.
Jai Hind 🇮🇳 pic.twitter.com/mhAjLbtOvG
— P C Mohan (@PCMohanMP) July 15, 2022