CM KCR : వ‌ర‌ద ప్రాంతాల్లో కేసీఆర్ ఏరియ‌ల్ స‌ర్వే

ఈనెల 17న ప‌ర్య‌టిస్తార‌ని సిఎంఓ ప్ర‌క‌ట‌న

CM KCR :  నైరుతి రుతుప‌వ‌నాల తాకిడికి తెలంగాణ త‌ల్ల‌డిల్లుతోంది. ప్ర‌ధానంగా ప‌లు జిల్లాలు నీళ్ల‌తో నిండి పోయాయి. కొన్ని ఊళ్ల‌కు ఊళ్లు నీళ్ల‌లోనే ఉన్నాయి. కొన్ని గ్రామాల మ‌ధ్య సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి.

ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎస్ , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిపై ఆరా తీస్తున్నారు.

తాజాగా ఈనెల 17న ఆదివారం ఉద‌యం ప్ర‌కృతి విప‌త్తు, గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతంలో పోటెత్తిన వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి(CM KCR) కార్యాల‌యం వెల్ల‌డించింది.

శ‌నివారం ఇందుకు సంబంధించి అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. ముంద‌స్తు వాతావ‌ర‌ణ హెచ్చ‌రిక నేప‌థ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ముందు జాగ్ర‌త్త‌గా లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

వారికి అన్ని వ‌స‌తి సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. కొంద‌రు మంత్రులు బాధితుల‌కు భ‌రోసా ఇస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను పర్య‌వేక్షిస్తున్నారు.

మ‌రో వైపు ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల తాకిడికి పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తోంది గోదావ‌రికి(Godavari Floods). దీంతో అది ఉగ్ర రూపం దాల్చుతోంది. ఇప్ప‌టికే 72 అడుగుల నీటి మ‌ట్టం దాటింది. ప్ర‌స్తుతం భ‌ద్రాచ‌లం జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకుంది.

ఈ త‌రుణంలో ఆయా ప్రాంతాల్లో వ‌ర‌ద ప‌రిస్థితిని సీఎం ప‌రిశీలిస్తారు. రెండు మూడు ప్రాంతాల్లో కూడా క్షేత్ర స్థాయి స‌మీక్ష చేప‌డ‌తారు. ముంపు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డ‌తారు. సీఎంతో పాటు సీఎస్, మంత్రి పాల్గొంటారు.

Also Read : జ‌ల దిగ్బంధంలో భ‌ద్రాచ‌లం

Leave A Reply

Your Email Id will not be published!